సెప్టెంబర్, 2010ను భద్రపఱచు

పురాణ, ప్రాచీన కావ్యాలు, ప్రబంధాలు

  1. కవిత్రయం —— మదాంధ్ర మహాభారతం —— నన్నయ (1050), తిక్కన (1270), ఎర్రన (1350) (“మహాభారతం” వ్యాసం వేరు. “మదాంధ్ర మహాభారతం” వ్యాసం వేరు. ప్రస్తుతానికి అంతా కలగాపులగంగా ఉన్నది)
  2. నన్నెచోడుడు —— కుమార సంభవము —— 1120
  3. పాల్కురికి సోమనాధుడు —— బసవపురాణం —— 1150
  4. మల్లికార్జున పండితారాధ్యుడు —— పండితారాధ్య చరిత్ర —— 1150
  5. గోన బుద్ధారెడ్డి —— రంగనాధ రామాయణం —— 1200
  6. కేతన —— దశకుమార చరిత్ర —— 1270
  7. మారన —— మార్కండేయ పురాణము —— 1310
  8. నాచన సోమన —— ఉత్తర హరివంశం —— 1340
  9. శ్రీనాధుడు —— శృంగార నైషధము —— 1420
  10. శ్రీనాధుడు —— పల్నాటి వీరచరిత్రము —— 1430
  11. బమ్మెర పోతన, బొప్పరాజు గంగయ, ఏర్చూరి సింగన, వెలిగందల నారయ —— మదాంధ్ర మహాభాగవతం —— 1450 (“భాగవతం” వ్యాసం వేరు. “మదాంధ్ర మహాభాగవతం” వ్యాసం వేరు. ప్రస్తుతానికి అంతా కలగాపులగంగా ఉన్నది)
  12. తాళ్ళపాక తిమ్మక్క —— సుభద్రా కళ్యాణం —— 1450
  13. దగ్గుపల్లి దుగ్గన —— నచికేతోపాఖ్యానము —— 1460
  14. పిల్లలమర్రి పినవీరభద్రుడు —— శృంగార శాకుంతలము —— 1480
  15. కృష్ణదేవరాయలు —— ఆముక్త మాల్యద —— 1520
  16. అల్లసాని పెద్దన —— మనుచరిత్రము —— 1520
  17. నంది తిమ్మన —— పారిజాతాపహరణము —— 1520
  18. ధూర్జటి —— కాళహస్తి మహాత్మ్యము —— 1520
  19. మొల్ల —— మొల్ల రామాయణం —— 1550
  20. అయ్యలరాజు రామభద్రుడు —— రామాభ్యుదయము —— 1550
  21. మాదయగారి మల్లన —— రామాభ్యుదయం —— 1550
  22. తాళ్ళపాక చిన్నన్న —— పరమయోగి విలాసము —— 1550
  23. పింగళి సూరన —— కళాపూర్ణోదయము —— 1550
  24. సంకుసాల నృసింహకవి —— కవికర్ణ రసాయనము —— 1550
  25. తెనాలి రామకృష్ణ —— పాండురంగ మహాత్మ్యము —— 1570
  26. భట్టుకవి (రామరాజభూషణుడు) —— వసుచరిత్రము —— 1580
  27. కందుకూరు రుద్రకవి —— నిరంకుశోపాఖ్యానము —— 1580
  28. సారంగు తమ్మయ —— వైజయంతీ విలాసము —— 1580
  29. రాయ వాచకం —— విశ్వనాథనాయని స్థానాపతి —— 1600
  30. నంది మల్లయ, ఘంట సింగన —— ప్రబోధ చంద్రోదయం —— 1600
  31. చేమకూరి వెంకటకవి —— విజయ విలాసము —— 1630
  32. రంగాజమ్మ —— మన్నారుదాస విలాసం —— 1630
  33. ముద్దు పళని —— రాధికా సాంత్వనము —— 1700
  34. కంకంటి పాపరాజు —— ఉత్తర రామాయణము —— 1800
  35. తరిగొండ వెంకమాంబ —— వేంకటాచల మహాత్మ్యము —— 1800

శతకాలు

  1. యథావాక్కుల అన్నమయ్య —— సర్వేశ్వర శతకం —— 1242
  2. బద్దెన —— నీతిసార ముక్తావళి —— 1300
  3. బద్దెన? —— సుమతీ శతకం —— 1300
  4. ధూర్జటి —— శ్రీకాళహస్తీశ్వర శతకం —— 1550
  5. వేమన —— వేమన శతకం —— 1700
  6. ఏనుగు లక్ష్మణకవి —— భర్తృహరి సుభాషితాలు —— 1750
  7. కాసుల పుషోత్తమ కవి —— ఆంధ్రనాయక శతకం —— 1750
  8. ? —— కృష్ణాశతకము ——
  9. కూచిమంచి తిమ్మకవి —— కుక్కుటేశ్వర శతకము ——
  10. అడిదము సూరకని —— రామలింగేశ్వర శతకము ——
  11. రామదాసు —— దాశరధి శతకం ——
  12. సిరిసిరిమువ్వ శతకం —— శ్రీశ్రీ ——
  13. విఠ్ఠలేశ్వర శతకం —– డా.కూరెళ్ళ విఠ్ఠలాచార్య ———- —— 2000

కీర్తనలు, పదాలు

  1. అన్నమయ్య —— అన్నమయ్య కీర్తనలు —— 1430
  2. క్షేత్రయ్య —— క్షేత్రయ్య పదాలు —— 1650
  3. రామదాసు —— రామదాసు కీర్తనలు —— 1700
  4. తూము నరసింహదాసు —— తూము నరసింహదాసు కీర్తనలు —— 1750
  5. త్యాగయ్య —— త్యాగరాజు కీర్తనలు —— 1800

 

ఆధునిక యుగం

 

పద్య, గేయ కావ్యాలు, కవితలు

  1. బేతవోలు రామబ్రహ్మం —— వ్యాసగౌతమి —— 2004
  2. అక్కిరాజు రమాపతిరావు —— ప్రతిభామూర్తులు ——
  3. అజంతా (పి.వి.శాస్త్రి) —— స్వప్నలిపి —— 1990 (1997 సాహిత్య అకాడమీ అవార్డు)
  4. ఆరుద్ర —— ఇంటింటి పజ్యాలు —— 1970
  5. ఆరుద్ర —— త్వమేవాహం —— 1949
  6. ఆరుద్ర —— కూనలమ్మ పదాలు ——
  7. ఆలూరి బైరాగి —— ఆగమ గీతి —— 1960 (1984 సాహిత్య అకాడమీ అవార్డు)
  8. ఆలూరి బైరాగి —— నూతిలో గొంతుకలు —— 1955
  9. ఇస్మాయిల్‌ —— చెట్టు నా ఆదర్శం —— 1960
  10. ఉత్పల సత్యనారాయణాచార్యులు —— శ్రీకృష్ణ చంద్రోదయము —— (2003 సాహిత్య అకాడమీ అవార్డు)
  11. ఎన్.గోపి —— కాలాన్ని నిద్రపోనివ్వను —— (2000 సాహిత్య అకాడమీ అవార్డు)
  12. ఏటుకూరి వెంకటనరసయ్య —— మగువమాంచాల —— 1947
  13. ఓల్గా, కన్నాభిరన్ (సంకలనం) —— నీలిమేఘాలు —— 1990
  14. కుందుర్తి ఆంజనేయులు —— తెలంగాణా, హంస ఎగిరిపోయింది —— (1977 సాహిత్య అకాడమీ అవార్డు)
  15. కుందుర్తి ఆంజనేయులు —— నగరంలో వాన —— 1944
  16. కొండేపూడి నిర్మల —— నడిచే గాయాలు —— 1990
  17. ఖాదర్‌ మొహియుద్దీన్‌ —— పుట్టు మచ్చ —— 1990
  18. గడియారం వేంకటశేష శాస్త్రి —— శివభారతము —— 1943
  19. గుంటూరు శేషేంద్ర శర్మ —— ఆధునిక మహాభారతం —— 1985
  20. గురజాడ అప్పారావు —— ముత్యాల సరాలు —— 1910
  21. జంధ్యాల పాపయ్య శాస్త్రి (కరుణశ్రీ) —— విజయశ్రీ, కరుణశ్రీ —— 1948
  22. జయప్రభ —— చింతల నెమలి —— 1990
  23. జాషువా —— గబ్బిలం —— 1950
  24. జాషువా —— క్రీస్తు చరిత్ర —— (1964 సాహిత్య అకాడమీ అవార్డు)
  25. జాషువా —— ఫిరదౌసి —— 1932
  26. జి. లక్ష్మీనరసయ్య, త్రిపురనేని శ్రీనివాస్‌ (సంకలనం) —— చిక్కనవుతున్న పాట —— 1990
  27. తుమ్మల సీతారామమూర్తి —— రాష్ట్రగానము —— 1938
  28. తుమ్మల సీతారామమూర్తి —— మహాత్ముని కధ —— (1969 సాహిత్య అకాడమీ అవార్డు)
  29. దాశరథి —— దాశరధి కవితలు (అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, తిమిరంతో సమరం) —— 1950
  30. దాసు శ్రీరాములు —— తెలుగు నాడు —— 1910
  31. దిగంబర కవులు —— దిగంబరకవిత్వం —— 1970
  32. దుర్భాక రాజశేఖర శతావధాని —— రాణా ప్రతాపసింహ వరిత్ర —— 1934
  33. దువ్వూరి రామిరెడ్డి —— పానశాల —— 1935
  34. దేవరకొండ బాలగంగాధరతిలక్‌ —— అమృతం కురిసిన రాత్రి —— 1968 (1979 సాహిత్య అకాడమీ అవార్డు)
  35. దేవులపల్లి కృష్ణ శాస్త్రి —— కృష్ణపక్షము, ప్రవాసము, ఊర్వశి —— 1925-30 (1978 సాహిత్య అకాడమీ అవార్డు)
  36. నండూరి రామకృష్ణాచార్య (సంకలనం) —— వెయ్యేళ్ళ తెలుగు పద్యం ——
  37. నండూరి సుబ్బారావు —— ఎంకి పాటలు —— 1935
  38. నగ్నముని —— కొయ్య గుర్రం —— 1970
  39. పఠాభి (తిక్కవరపు పట్టాభిరామిరెడ్డి) —— ఫిడేలు రాగాల డజన్‌ —— 1939
  40. పాపినేని శివశంకర్, పెనుగొండ లక్ష్మీనారాయణ (సంకలనం) —— కవితా ఓ కవితా ——
  41. పింగళి కాటూరి కవులు (పింగళి లక్ష్మీకాంతం, కాటూరి వెంకటేశ్వరరావు) —— సౌందరనందము —— 1932
  42. తురగా జానకీరాణి (సంకలనం) —— పిల్లల పాటలు ——
  43. పుట్టపర్తి నారాయణాచార్యులు —— జనప్రియ రామాయణము ——
  44. పుట్టపర్తి నారాయణాచార్యులు —— శివతాండవం —— 1961
  45. బసవరాజు అప్పారావు —— బసవరాజు అప్పారావు గేయాలు —— 1921
  46. బోయి భీమన్న —— రాగ వైశాఖి —— 1960
  47. బోయి భీమన్న —— గుడిసెలు కాలిపోతున్నాయి —— (1975 సాహిత్య అకాడమీ అవార్డు)
  48. మధునాపంతుల సత్యనారాయణ శాస్త్రి —— ఆంధ్ర పురాణము —— 1954
  49. మహెజబీన్‌ —— ఆకు రాలే కాలం —— 1990
  50. ముద్దుకృష్ణ (సంకలనం) —— వైతాళికులు —— 1935
  51. రాయప్రోలు సుబ్బారావు —— తృణకంకణము, ఆంధ్రావళి, జడకుచ్చులు —— 1913
  52. రాయప్రోలు సుబ్బారావు —— మిశ్ర మంజరి (సంకలనం) —— (1965 సాహిత్య అకాడమీ అవార్డు)
  53. వావిలికొలను సుబ్బారావు —— మదాంధ్ర వాల్మీకి రామాయణం (మందరం) —— 1950
  54. విద్వాన్‌ విశ్వం —— పెన్నేటి పాట —— 1956
  55. విశ్వనాథ సత్యనారాయణ —— రామాయణ కల్పవృక్షము —— (1979 సాహిత్య అకాడమీ అవార్డు)
  56. విశ్వనాథ సత్యనారాయణ —— కిన్నెరసాని పాటలు —— 1930
  57. విశ్వనాథ సత్యనారాయణ —— మధ్యాక్కరలు —— (1962 సాహిత్య అకాడమీ అవార్డు)
  58. విశ్వనాథ సత్యనారాయణ —— ఆంధ్రప్రశస్తి ——
  59. వేంకట పార్వతీశ కవులు —— ఏకాంతసేవ ——
  60. వేగుంట మోహనప్రసాద్‌ —— చితి చింత —— 1980
  61. వేదుల సత్యనారాయణ —— దీపావళి —— 1937
  62. శివారెడ్డి —— శివారెడ్డి కవితలు, మోహనా ఓ మోహనా —— 1980 (1990 సాహిత్య అకాడమీ అవార్డు)
  63. శ్రీశ్రీ —— మహాప్రస్థానం —— 1940
  64. శ్రీశ్రీ —— ఖడ్గ సృష్టి —— 1950
  65. సతీష్‌ చందర్‌ —— పంచమవేదం —— 1990
  66. సి.నారాయణ రెడ్డి —— మంటలు – మానవుడు —— (1973 సాహిత్య అకాడమీ అవార్డు)
  67. సి.నారాయణ రెడ్డి —— కర్పూరవసంతరాయలు —— 1957
  68. సి.నారాయణ రెడ్డి —— విశ్వంభర ——
  69. వెలగా వెంకటప్పయ్య (సంకలనం) —— స్త్రీల పాటలు
  70. పాలపర్తి ఇంద్రాణి ——-వానకు తడిసిన పువ్వొకటి—-2005

కధలు, కధా సంకలనాలు

  1. అబ్బూరి ఛాయాదేవి —— ఛాయాదేవి కథలు —— 1960 (2005 సాహిత్య అకాడమీ అవార్డు)
  2. ఆర్. చంద్రశేఖర రెడ్డి, కె. లక్ష్మీనారాయణ (సంకలనం) —— దళిత కథలు ——
  3. ఆచంట శారదాదేవి —- పారిపోయిన చిలుక, ఒక్కనాటి అతిథి
  4. ఇల్లిందల సరస్వతీ దేవి —— స్వర్ణ కమలాలు —— (1982 సాహిత్య అకాడమీ అవార్డు)
  5. ఎ.ఎస్‌. మూర్తి —— తానా తెలుగు కథ —— 1990
  6. ఎం.ఎ. సుభాన్‌ (సంకలనం) —— కథాసాగర్‌ —— 1990
  7. కాళీపట్నం రామారావు —— యజ్ఞం, కా.రా. కథలు —— 1980 (1995 సాహిత్య అకాడమీ అవార్డు)
  8. కేతు విశ్వనాధరెడ్డి —— కేతు విశ్వనాధరెడ్డి కధలు —— (1996 సాహిత్య అకాడమీ అవార్డు)
  9. కొడవటిగంటి కుటుంబరావు —— కొడవటిగంటి కుటుంబరావు కథలు (సంకలనం. కేతు విశ్వనాధ రెడ్డి) —— 1950
  10. చాగంటి సోమయాజులు —— చాసో కథలు —— 1940
  11. చెళ్ళపిళ్ళ వేంకట శాస్త్రి —— కథలు గాధలు —— 1940
  12. డి. రామలింగం —— తెలుగు కధ (సంకలనం) ——
  13. నగ్నముని —— విలోమ కధలు —— 1976
  14. నామిని సుబ్రహ్మణ్యం నాయుడు —— పచ్చనాకు సాక్షిగా —— 1990
  15. పాలగుమ్మి పద్మరాజు —— గాలివాన పాలగుమ్మి పద్మరాజు కథలు —— 1940 (1990 సాహిత్య అకాడమీ అవార్డు)
  16. పురాణం సుబ్రహ్మణ్య శర్మ, వాకాటి పాండురంగారావు —— కథాభారతి (సంకలనం)——
  17. బలివాడ కాంతారావు —— బలివాడ కాంతారావు కథలు —— (1998 సాహిత్య అకాడమీ అవార్డు)
  18. భమిడిపాటి రామగోపాలం —— ఇట్లు, మీ విధేయుడు —— (1991 సాహిత్య అకాడమీ అవార్డు)
  19. భానుమతీ రామకృష్ణ —— అత్తగారి కథలు —— 1960
  20. మధురాంతకం రాజారాం —— మధురాంతకం రాజారాం కథలు —— 1980
  21. మునిమాణిక్యం నరసింహారావు —— కాంతం కథలు —— 1940
  22. ముళ్ళపూడి వెంకటరమణ —— ముళ్ళపూడి వెంకటరమణ కథలు —— 1950
  23. రాచకొండ విశ్వనాథ శాస్త్రి —— రాచకొండ విశ్వనాథ శాస్త్రి కథలు —— 1960
  24. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి —— శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి కథలు —— 1940
  25. సత్యం శంకరమంచి —— అమరావతి కథలు —— 1978
  26. సింగమనేని నారాయణరావు —— సీమ కథలు (సంకలనం) ——
  27. శ్వేతరాత్రులు (సంకలనం)
  28. రుతుపవనాలు (సంకలనం) ——
  29. తుమ్మేటి రఘోత్తమరెడ్డి కథలు (సంకలనం) ——
  30. నల్లకలువలు (సంకలనం) ——
  31. తెలంగాణ కథలు (సంకలనం) —

నవలలు

  1. అడివి బాపిరాజు —— నారాయణరావు —— 1934
  2. అడివి బాపిరాజు —— హిమబిందు ——
  3. ఉన్నవ లక్ష్మీనారాయణ —— మాలపల్లి —— 1922
  4. ఉప్పల లక్ష్మణరావు —— అతడు – ఆమె —— 1950
  5. ఓల్గా —— ఆకాశంలో సగం ——
  6. కాలువ మల్లయ్య —— బతుకు పుస్తకం ——
  7. కేశవ రెడ్డి —— రాముడుండాడు రాజ్జెవుండాది —— 1990
  8. కొడవటిగంటి కుటుంబరావు —— చదువు —— 1946
  9. గుడిపాటి వెంకటాచలం —— మైదానం —— 1928
  10. చంద్రలత —— రేగడివిత్తులు —— 1990
  11. చిలకమర్తి లక్ష్మీనరసింహం —— గణపతి —— 1920
  12. జి.వి. కృష్ణారావు —— కీలుబొమ్మలు —— 1951
  13. తెన్నేటి హేమలత —— గాలి పడగలు నీటి బుడగలు —— 1953, మలిముద్రణ 1970
  14. తెన్నేటి హేమలత —— మోహన వంశి ——
  15. త్రిపురనేని గోపీచంద్‌ —— అసమర్థుని జీవయాత్ర —— 1946
  16. త్రిపురనేని గోపీచంద్‌ —— పండిత పరమేశ్వర శాస్త్రి వీలునామా —— (1963 సాహిత్య అకాడమీ అవార్డు)
  17. దాశరధి రంగాచార్య —— చిల్లర దేవుళ్ళు —— 1987
  18. నవీన్ —— కాలరేఖలు —— (2004 సాహిత్య అకాడమీ అవార్డు)
  19. నవీన్ —— అంపశయ్య —— 2000
  20. బలివాడ కాంతారావు —– గోడ మీద బొమ్మ, దగా పడిన తమ్ముడు
  21. బీనాదేవి —— పుణ్యభూమీ కళ్ళు తెరు —— 1970
  22. బుచ్చిబాబు —— చివరకు మిగిలేది —— 1946
  23. బొల్లిముంత శివరామకృష్ణ —— మృత్యుంజయుడు —— 1947
  24. మహీధర రామమోహన రావు —— కొల్లాయి గట్టితేనేమి —— 1965
  25. మహీధర రామమోహన రావు —— రధ చక్రాలు ——
  26. మాలతీ చందూర్ —— హృదయ నేత్రి —— (1992 సాహిత్య అకాడమీ అవార్డు)
  27. మొక్కపాటి నరసింహ శాస్త్రి —— బారిష్టర్ పార్వతీశం —— 1924
  28. యండమూరి వీరేంద్రనాథ్ —— తులసి దళం —— 1970
  29. యద్దనపూడి సులోచనారాణి —— సెక్రటరి —— 1970
  30. రంగనాయకమ్మ —— స్వీట్‌హోం —— 1960
  31. రంగనాయకమ్మ —— జానకి విముక్తి —— 1977
  32. రంగనాయకమ్మ —— బలిపీఠం ——
  33. రాచకొండ విశ్వనాధశాస్త్రి —— అల్పజీవి —— 1956
  34. రాచకొండ విశ్వనాథశాస్త్రి ——- నాలుగార్లు —– 2003 9వ ముద్రణ
  35. రావూరి భరద్వాజ —— పాకుడురాళ్ళు —— 1965
  36. వట్టికోట ఆళ్వారు స్వామి —— ప్రజల మనిషి —— 1985
  37. వడ్డెర చండీదాస్‌ —— హిమజ్వాల —— 1970
  38. వడ్డెర చండీదాస్‌ —— అనుక్షణికం —— 1985
  39. వాసిరెడ్డి సీతాదేవి —— మట్టిమనిషి —— 1970
  40. వాసిరెడ్డి సీతాదేవి —— మరీచిక —— 1979
  41. విశ్వనాథ సత్యనారాయణ —— వేయి పడగలు —— 1939
  42. వుప్పల లక్ష్మణ రావు —— అతడు ఆమె —— 1930
  43. వెంకట పార్వతీశ్వర కవులు —— మాతృమందిరం —— 1918
  44. వేలూరి శివరామశాస్త్రి —— ఓబయ్య —— 1936
  45. శారద (యస్. నటరాజన్ —— అపస్వరాలు —— 1955
  46. పి. శ్రీదేవి —— కాలాతీతవ్యక్తులు —— 1958

నాటకాలు

  1. ఆత్రేయ —— ఎన్.జి.వొ., ఆత్రేయ నాటకాలు —— 1949
  2. కాళ్ళకూరి నారాయణ రావు —— వరవిక్రయం —— 1923
  3. గురజాడ అప్పారావు —— కన్యాశుల్కం —— 1897
  4. గోరాశాస్త్రి —— ఆశ ఖరీదు అణా —— 1964
  5. చిలకమర్తి లక్ష్మీనరసింహం —— గయోపాఖ్యానం —— 1890
  6. తిరుపతి వేంకట కవులు —— పాండవోద్యోగ విజయాలు —— 1907
  7. త్రిపురనేని రామస్వామి చౌదరి —— శంబుక వధ —— 1930
  8. త్రిపురనేని రామస్వామి చౌదరి —— త్రిపురనేని రామస్వామి నాటకాలు —— 1978
  9. ధర్మవరం కృష్ణమాచార్యులు —— విషాద సారంగధర —— 1957
  10. నార్ల వెంకటేశ్వర రావు —— కొత్త గడ్డ —— 1947
  11. నార్ల వెంకటేశ్వర రావు —— సీత జోస్యం —— (1981 సాహిత్య అకాడమీ అవార్డు)
  12. నిజం —— రాచకొండ విశ్వనాధశాస్త్రి ——
  13. పాకాల వేంకట రాజమన్నార్‌ —— రాజమన్నార్‌ నాటికలు —— 1930
  14. భమిడిపాటి కామేశ్వర రావు —— కచటతపలు —— 1940
  15. భమిడిపాటి రాధాకృష్ణ —— కీర్తిశేషులు —— 1960
  16. వేదం వేంకటరాయ శాస్త్రి —— ప్రతాపరుద్రీయం —— 1897
  17. సుంకర వాసిరెడ్డి —— మాభూమి —— 1947

యాత్రా గ్రంధాలు

  1. ఏనుగుల వీరాస్వామయ్య —— కాశీయాత్రా చరిత్ర —— 1838
  2. కోలా శేషాచలకవి —– నీలగిరి యాత్ర —– 1854
  3. నాయని కృష్ణకుమారి —– కాశ్మీర దీపకళిక

జీవిత చరిత్రలు, ఆత్మకధలు

  1. ఆచంట జానకీరామ్ —— నా స్మృతిపధంలో —— 1957
  2. ఆదిభట్ల నారాయణదాసు —— నా యెరుక —— 1920
  3. కనుపర్తి వరలక్ష్మమమ్మ —- ఉన్నవ లక్ష్మీనారాయణ దంపతులు
  4. కందుకూరి వీరేశలింగం —— కందుకూరి స్వీయచరిత్ర —— 1919
  5. కాళోజీ నారాయణరావు —— ఇదీ నా గొడవ —— 1953
  6. చరితానంద స్వామి —— శ్రీరామకృష్ణుని జీవిత చరిత్ర —— (1957 సాహిత్య అకాడమీ అవార్డు)
  7. టంగుటూరి ప్రకాశం —— నా జీవిత యాత్ర —— 1941
  8. తిరుమల రామచంద్ర —— హంపి నుంచి హరప్పా దాక —— 1990 (2001 సాహిత్య అకాడమీ అవార్డు)
  9. దరిశి చెంచయ్య —— నేనూ, నా దేశం —— 1930
  10. పుచ్చలపల్లి సుందరయ్య —— విప్లవ పథంలో నా పయనం —— 1950
  11. బాలాంత్రపు రజనీకాంతరావు —— ఆంధ్ర వాగ్గేయకారుల చరిత్ర —— (1961 సాహిత్య అకాడమీ అవార్డు)
  12. గుడిపాటి వెంకటచలం —— చలం ——- 1972
  13. రావూరి భరద్వాజ —— జీవన సమరం —— (1983 సాహిత్య అకాడమీ అవార్డు)
  14. వానమామలై వరదాచార్యులు —— పోతన చరిత్ర ——
  15. శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి —— అనుభవాలు జ్ఞాపకాలు —— 1955
  16. ఉప్పల లక్ష్మణరావు —— బతుకుపుస్తకం ——
  17. గడియారం రామకృష్ణ శర్మ —– శతపత్రము
  18. భమిడిపాటి రామగోపాలం —– ఆరామగోపాలమ్

సాహితీ చరిత్ర, పరిశోధన, విమర్శ

  1. అక్కిరాజు ఉమాకాంతం —— నేటికాలపు కవిత్వం —— 1928
  2. ఆరుద్ర —— గురజాడ గురుపీఠం —— (1987 సాహిత్య అకాడమీ అవార్డు)
  3. ఆరుద్ర —— సమగ్ర ఆంధ్ర సాహిత్యం —— 1967
  4. ఆర్.ఎస్. సుదర్శనం —— సాహిత్యంలో దృక్పధాలు —— 1968
  5. ఎస్.వి. జోగారావు —— ఆంధ్ర యక్షగాన వాఙ్మయ చరిత్ర ——
  6. కట్టమంచి రామలింగారెడ్డి —— కవిత్వతత్వ విచారము —— 1914
  7. కఠెవరపు వెంకట్రామయ్య —— తెలుగు భాషా చరిత్ర ——
  8. కురుగంటి సీతారామాచార్యులు —— నవ్యాంధ్ర సాహిత్య వీధులు —— 1942
  9. కె.వి. రమణారెడ్డి —— అక్షర తూణీరం —— 1995
  10. గుంటూరు శేషేంద్రశర్మ —— కాలరేఖ —— (1994 సాహిత్య అకాడమీ అవార్డు)
  11. చేకూరి రామారావు —— స్మృతికిణాంకం —— (2002 సాహిత్య అకాడమీ అవార్డు)
  12. జానపద విజ్ఞానం —— ఆర్.వి.ఎస్.సుందరం ——
  13. జి.వి. సుబ్రహ్మణ్యం —— ఆంధ్ర సాహిత్య విమర్శపై ఆంగ్ల ప్రభావం —— (1986 సాహిత్య అకాడమీ అవార్డు)
  14. తాపీ ధర్మారావు —— విజయ విలాసము – హృదయోల్లాస వ్యాఖ్య —— (1971 సాహిత్య అకాడమీ అవార్డు)
  15. పింగళి లక్ష్మీకాంతం —— ఆంధ్ర సాహిత్య చరిత్ర —— 1954
  16. పోనంగి అప్పారావు —— భరతుని నాట్యశాస్త్రము —— (1960 సాహిత్య అకాడమీ అవార్డు)
  17. బిరుదురాజు రామరాజు —— తెలుగు జానపద గేయ సాహిత్యము —— 1986
  18. బేతవోలు రామబ్రహ్మం —— పద్యకవితా పరిచయం ——
  19. రాచమల్లు రామచంద్రారెడ్డి —— అనువాద సమస్యలు —— (1988 సాహిత్య అకాడమీ అవార్డు)
  20. రాచమల్లు రామచంద్రారెడ్డి —— సారస్వత వివేచన —— 1976
  21. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ —— వేమన —— 1928
  22. రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ —— సారస్వతావలోకనం ——
  23. వల్లంపాటి వెంకటసుబ్బయ్య —— కధాశిల్పం —— (199 సాహిత్య అకాడమీ అవార్డు)
  24. వి.లక్ష్మణరెడ్డి —— తెలుగు పత్రికా రచన – అవతరణ వికాసములు ——
  25. వేటూరి ప్రభాకర శాస్త్రి —— తెలుగు మెఱుగులు ——
  26. శ్రీపాద గోపాలకృష్ణమూర్తి —— అర్ధశతాబ్దపు ఆంధ్ర కవిత్వం —— 1994
  27. సర్దేశాయి తిరుమలరావు —— శివభారత దర్శనము —— 1971
  28. సి.నారాయణరెడ్డి —— ఆధునికాంధ్ర కవిత్వం, సంప్రదాయం, ప్రయోగం ——
  29. డా. సాకిగారి చంద్ర కిరణ్ —- శ్రీపాద (తెలుగు) – మాస్తి (కన్నడ) కథలు తులనాత్మక పరిశీలన —- (శ్రీపాద్ సుబ్రహ్మణ్య శాస్త్రి – మాస్తి వెంకటేశ అయ్యంగారు) – 2005

30 దార్ల వెంకటేశ్వరరావు — ఙ్ఞానానందకవి ఆమ్రపాలి పరిశీలన — 1998 31 వొక రాజ కుమారుడి కథ —- కాంతారావు

చరిత్ర, సంస్కృతి

  1. ఖండవల్లి లక్ష్మీరంజనం, బాలేందు రాజశేఖరం —— ఆంధ్రుల చరిత్ర, సంస్కృతి —— 1951
  2. చిలుకూరి వీరభద్రరావు —— ఆంధ్రుల చరిత్రము —— 1919
  3. మాడపాటి హనుమంతరావు —— తెలంగాణ ఆంధ్రోద్యమ చరిత్ర ——
  1. మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి —— తెలుగువారి జానపద కళారూపాలు —— 1992
  1. సురవరం ప్రతాపరెడ్డి —— ఆంధ్రుల సాంఘిక చరిత్ర —— 1949 (1955 సాహిత్య అకాడమీ అవార్డు)
  2. స్త్రీశక్తి సంఘటన —— మనకు తెలియని మన చరిత్ర —— 1990

ఏటుకూరు బలరామ్మూర్తి —- చరిత్ర సంస్కృతి

తత్వ శాస్త్రం, తాత్వికత, భావాలు

  1. గుడిపాటి వెంకటాచలం —— మ్యూజింగ్స్
  2. దాశరథి రంగాచార్య —— శ్రీ మదాంధ్ర వచన వేద వాఙ్మయం ——
  3. బులుసు వెంకటేశ్వర్లు —— భారతీయ తత్వశాస్త్రము —— (1956 సాహిత్య అకాడమీ అవార్డు)
  4. త్రిపురనేని గోపీచంద్ —— తత్వవేత్తలు
  5. నండూరి రామమోహనరావు —— విశ్వదర్శనం

ఉపన్యాసాలు, వ్యాసాలు

  1. ఎస్.వి.జోగారావు —— మణి ప్రవాళము —— (1989 సాహిత్య అకాడమీ అవార్డు)
  2. గిడుగు రామమూర్తి —— ఆంధ్ర పండిత భిషక్కుల భాషా భేషజం —— 1920
  3. చలం —— స్త్రీ —— 1930
  4. పానుగంటి లక్ష్మీనరసింహారావు —— సాక్షి వ్యాసాలు —— 1930
  5. పురాణం సీత —— ఇల్లాలి ముచ్చట్లు ——
  6. యువభారతి —— మహతి ——
  7. రాళ్ళపల్లి అనంతకృష్ణ శర్మ —— నాటకోపన్యాసములు —— 1940

నిఘంటువులు

  1. ఛార్లెస్ ఫిలిప్ బ్రౌన్ —— బ్రౌన్ నిఘంటువు ——
  2. శంకర నారాయణ తెలుగు-ఇంగ్లీషు నిఘంటువు — 1900
  3. ఉర్దూ-తెలుగు నిఘంటువు —-ఐ.కొండలరావు — 1938

విజ్ఞానం, విజ్ఙాన సర్వస్వాలు

  1. కొమర్రాజు వేంకటలక్ష్మణరావు (సంపాదకత్వం) —— ఆంధ్ర విజ్ఞాన సర్వస్వము ——
  2. నండూరి రామమోహనరావు —— విశ్వరూపం ——

ఇతరాలు

  1. కనుపర్తి వరలక్ష్మమ్మ —— శారద లేఖలు —— 1934
  2. చేకూరి రామారావు —— చేరాతలు ——
  3. తాపీ ధర్మారావు —— పాతపాళీ —— 1955
  4. తెన్నేటి హేమలత —— ఊహాగానం —— 1975
  5. పప్పూరి రామాచార్యులు —— వదరుబోతు —— 1953
  6. ముట్నూరి కృష్ణారావు —— లోవెలుగులు, ముట్నూరి కృష్ణారావు సంపాదకీయాలు —— 1937
  7. ముళ్ళపూడి వెంకట రమణ —— బుడుగు —— 1950
  8. వెలగా వెంకటప్పయ్య (సంకలనం) —— బాలసాహిత్యం ——
  9. సంజీవ్ దేవ్ —— రసరేఖలు —— 1965
  10. సామల సదాశివ ——-మలయమారుతాలు

మన రజకులందరినీ ఒక త్రాటి పెయ్కి తీసుకురావడానికి, కలిసి ఐక్యమత్యముగా ఉద్యమాలను చేయడానికి , మన రజక హక్కులను సాధించుకోవడానికి ,మనకున్న హక్కులను కాపాడుకోవడానికి పోరాటానికి చేసే చిరు ప్రయత్నంలో రజకులను వుత్తేజేపరిచేవిదముగా వుండే కథలు కానీ కవితలుగాని , పాటలుకానీ ,వ్యాసాలుకాని మీకు తెలిసినవి ,తెలియచెప్పలనుకునేవి స్క్రాప్ లో వ్రాయండి .వాటిని మన రజక బ్లాగ్ లో ప్రచురించబడును

భూమికోసం, భుక్తికోసం, పేదల వి ముక్తి కోసం సాగిన వీరతెలంగాణ విప్ల వ సాయుధపోరులో విస్నూరు దొరరా పాక రాంచంద్రారెడ్డి ఆగడాలపై కొం గు నడుముకుచుట్టి ముందునడిచి న తొలివీరనారి చాకలి ఐలమ్మ. బాంఛన్ దొర నీకాల్మొక్తా అనే రోజుల్లో జీవన్మర ణంగా సాగిన తెలంగాణ రైతాంగ పో రాటంలో ఆడదంటే అబలకాదు ఆదిశ క్తి అని నిరూపించుకుంది ఐలమ్మ. ఆ మె తన పంట పొలంలో పండించిన దాన్యం విషయంలో ప్రారంభించిన ఉ ద్యమం యావత్ తెలంగాణ జిల్లాలకు వ్యాపించింది. విస్నూరు దేశ్‌ముఖ్ రాపాక రాంచంద్రారెడ్డికి వ్యతిరేకంగా ఎర్రజెండా చేతపట్టి ప్రజలను సమీక రించి సాగించిన పోరాటం ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొందడం పాల కుర్తికే గర్వకారణం.

అసలేం జరిగింది.. ఐలమ్మ తన చాకలి వృత్తిలో ఆర్థికం గా నిలదొక్కుకోలేకపోయింది. ఇది గ మనించిన కుటుంబీకులు మల్లంపల్లి జమీందారు దగ్గర 40 ఎకరాల భూమి ని కౌలుకు తీసుకుని సాగుచేస్తుండగా పాలకుర్తి పోలీసు పటేల్ వీరమనేని శేషగిరిరావు గ్రామంలో పెత్తనం చేస్తూ ప్రజలను తన పంటపొలాల్లో వెట్టిచాకి రి చేయించుకునేవాడు. ఓ రోజున పో లీసుపటేల్ శేషగిరిరావు ఐలమ్మను, ఆమె భర్త నర్సయ్యను పశువులతో వ చ్చి పనిచేయమని హుకుం జారీచేశా రు.

అప్పటికే ఆంధ్ర మహాసభ పాల కుర్తి శాఖలో చేరిన ఐలమ్మ కుటుంబం మహాసభ ఇచ్చిన చైతన్య స్ఫూర్తితో ప శువులతో పనిచేయడానికి నిరాకరించా రు. దీంతో ఆగ్రహించిన పటేల్ శేషగి రిరావు ఐలమ్మ కుటుంబంపై కక్షకట్టి ఆంధ్రమహా సభలో చేరిందని, నాయ కులకు ఆశ్రయం కల్పించి అన్నం పెడు తుందని దాడులు చేయించాడు. ఐల మ్మ భర్త నర్సయ్య, సంఘం నాయకు లు ఆరుట్ల రాంచంద్రారెడ్డి, బీంరెడ్డి న ర్సింహారెడ్డి, నల్లానర్సింహులు, నట్లు ప్రతాప్‌రెడ్డిలను దేవులపల్లి వెంకటేశ్వర్ రావు తీసుకవచ్చాడు. దొర ఆగడాలు ఐలమ్మ కుటుంబాన్ని నిలువునా వణి కించాయి.

అరుణ పతాకం ఎగురేసి.. దీంతో భూమి కోసం, భుక్తి కోసం పోరాడతున్న విషయం తెలుసు కున్న పుచ్చలపల్లి సుందరయ్య ఐలమ్మ ఇంటికి వచ్చి ఆమె ఇల్లునే కమ్యూనిస్టు పార్టీ కార్యాలయంగా మార్చి ఆ ఆవ రణలోనే అరుణపతాకాన్ని ఎగుర వేశాడు.

ఐలమ్మ బయోడెటా.. ఐలమ్మ 1895లో రాయపర్తి మండ లం కిష్టాపురంలో జన్మించగా 1908లో తన 13వ ఏట పాలకుర్తికిచెందిన చిట్యాల నర్సయ్యతో వివాహం జరిగింది. 1985, సెప్టెంబర్ 10న కీర్తిశేషురాలైంది.

త్వరలో కాంస్య విగ్రహం ఆమె మరణించి నేటికీ 25సంవత్స రాలు కావస్తోంది. ఐలమ్మ పోరాటాని కి చిహ్నంగా మండల కేంద్రమైన పా లకుర్తిలో సీపీఎం ఆధ్వర్యంలో స్మారక భవనం, స్థూపం నిర్మించారు. కాగా, ఇ టీవల మృతిచెందిన ప్రొఫెసర్ కేసరా జు కుమార్, ఐలమ్మ మనువడు చిట్యా ల రాంచంద్రంలు కలిసి రూ.3లక్షల వి లువచేసే కాంస్య విగ్రహాన్ని రాజమం డ్రిలో తయారు చేయించారు. ఐలమ్మ విగ్రహం ఆవిష్కరించకుండానే మృతి చెందారు. ఆయన చివరి ఆశయం నెర వేరేందుకు 2011 ఏప్రిల్‌లో ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని రాంచం ద్రం తెలిపారు.

పేరుమోసిన దొరోడి గడికి కాలినడకన వెళ్లి ‘చాకలి అంటే అరత అలుసా..’ అని ప్రశ్నించింది. తెగిస్తే.. అదే ప్రశ్నిస్తే.. ప్రతి మహిళా రాణిరుద్రమా అవుతుందని నిరూపించింది. ఇంత తెగువ ఎక్కడి నుండి వచ్చింది. ఇంతకి ఆమె ఎవ్వరూ? ఆమే ధీరవనిత చాకలి ఐలమ్మ. ఇప్పుడు అందరూ ఆమెమాటే ఎత్తుతున్నారు. ఆమెలా ఉద్యమించాలని ఢిల్లీ నుండి గల్లీ వరకూ నాయకులు పిలుపునిస్తున్నారు. అంతటి చరిత్రను మూటగట్టుకున్న చాకలి ఐలమ్మ 25వ వర్థంతి నేడు. ఈ సందర్భంగా ప్రజాశక్తి ప్రత్యేక కథనం…

ఐలమ్మ పుట్టినిల్లు వరంగల్‌ జిల్లా రాయపర్తి మండలం క్రిష్టాపురం గ్రామం. ఆ పక్కనే ఉన్న పాలకుర్తి మండల కేంద్రంలో ఆ వీరవనిత మెట్టినిల్లు. చాకలి ఐలమ్మ పుట్టి పెరిగింది పేదింట్లో. కష్టాలు తెలుసు. కన్నీళ్లూ తెలుసు. దొరోడు భూమి లాక్కుంటుంటే విడిచి పెట్టలే. ఈ భూమి నాది అంటూ తిరుగుబాటు చేసింది. తెలంగాణా రైతాంగ సాయుధ పోరులో అరుణతారలా మెరిసింది. ప్రజా పోరాటాలకు ఆదర్శప్రాయురాలైంది. పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మ బాల్య వివాహం జరిగింది. వీరికి నలుగురు కుమారులు, ఒక కుమార్తె. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం. ప్రధానంగా కులవృత్తే జీవనాధారం. మల్లంపల్లి భూస్వామి కొండలరావుకు పాలకుర్తిలో 40 ఎకరాల భూమి ఉండగా ఐలమ్మ కౌలుకు తీసుకుంది. అందులో నాలుగు ఎకరాలు సాగుచేశారు. పాలకుర్తి పట్వారీ వీరమనేని శేషగిరిరావుకు ఐలమ్మ కుటుంబానికి విరోధం ఏర్పడింది. ప్రజలు వెట్టికి గురై స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితులు కల్పించబడ్డాయి. దొరలచే పీడించబడిన జీడి సోమనర్సయ్య నాయకత్వంలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. ఐలమ్మ ఆ సంఘంలో సభ్యురాలు. పాలకుర్తి పట్వారీ శేషగిరిరావు ఐలమ్మను కుటుంబంతో వచ్చి తన పొలంలో పనిచేయాలని ఒత్తిడి చేయడంతో ఆంధ్ర మహాసభ నింపిన చైతన్య స్ఫూర్తితో పనిచేయడానికి నిరాకరించింది. ఎలాగైనా లొంగదీసుకోవాలనుకున్న భూస్వాములు కుట్రలను తిప్పికొట్టింది. విసునూరు దేశ్‌ముఖ్‌ రాపాక రాంచంద్రారెడ్డికి ఐలమ్మ కుటుంబం కమ్యూనిస్టుల్లో చేరిందని, వారికి ఆశ్రయం కల్పిస్తుందని పాలకుర్తి పట్వారీ ఫిర్యాదు చేశారు. రాంచంద్రారెడ్డికి ప్రతి గ్రామంలోనూ ఏజెంట్లు ఉన్నారు. అందులో ఒకరు వీరమనేని శేషగిరిరావు. విసునూరు దొర అండతో గ్రామాల్లో ఏజెంట్లు, వారి అనుచరులు ప్రజల్ని చిత్రహింసలు పెట్టారు. ఐలమ్మను దెబ్బకొట్టాలని వేచిచూసిన దొరకు పాలకుర్తి జాతర కలిసివచ్చింది. ఆ జాతరలోనే ఆంధ్ర మహాసభ ఆధ్వర్యంలో బహిరంగ సభను ఏర్పాటు చేశారు. వేలాది మంది పాల్గొనే జాతరలో తనమాటను ఖాతరు చేయలేరని దేశ్‌ముఖ్‌ పోలీసులను ఉపయోగించుకున్నాడు. గుండాలను, అనుచరులను పాలకుర్తికి పంపాడు. రద్దీగా ఉన్న జనంలోకి దేశ్‌ముఖ్‌ గుండాలు చేరారు. సభను భగం చేసేందుకు ఘర్షణ సృష్టించారు. అంతకు ముందురోజు నాయకులను హత్య చేస్తామని హెచ్చరించారు. గొడవతో సభ నిలిపివేశారు. కారణాలు వివరించేందుకు నాయకులు సమావేశమయ్యారు. అటుగా వచ్చిన గుండాలు దాడిచేసే ప్రయత్నంలోనే స్థానిక నాయకుడు జీడి సోమనర్సయ్య, కార్యకర్తలు దొర అనుచరుడైన ఓనమాన వెంకయ్యను చితకబాదారు. వాలంటీర్లు అప్రమత్తంగా ఉండటంతో గుండాలు పారిపోయారు. తన అనుచరుడిని దేహశుద్ధి చేయడాన్ని జీర్ణించుకోలేని దేశ్‌ముఖ్‌ రాంచంద్రారెడ్డి తనను హత్యచేసేందుకు కుట్ర పన్నారని, అనుచరులపైన దాడికి పాల్పడ్డారని అక్రమ కేసులు పెట్టించారు. ఆ కేసులో అగ్రనాయకులతో పాటు ఐలమ్మ కుమారులు చిట్యాల సోమయ్య, చిట్యాల లచ్చయ్య, భర్త నర్సయ్యలను ఇరికించారు. అయినప్పటికీ కోర్పులో తీర్పు దేశ్‌ముఖ్‌కు వ్యతిరేకంగా వచ్చింది. ఐలమ్మను ఆర్థికంగా దెబ్బతీస్తే సంఘం పట్టుకోల్పోతుందని భావించిన దేశ్‌ముఖ్‌ మల్లంపల్లి భూస్వామిని పిలిపించుకున్నాడు. పాలకుర్తిలో ఐలమ్మ సాగుచేస్తున్న భూమిని తన పేరున రాయించుకున్నాడు. ఐలమ్మ సాగుచేసిన భూమి తనదని, పండించిన పంట తనకే దక్కుతుందని పంటను కోసుకరమ్మని వందమంది అనుచరులను పాలకుర్తికి పంపాడు. ఈ విషయాలపై అప్పటికే చర్చించిన కమ్యూనిస్టు నాయకత్వం యువ కిశోరాలను రంగంలోని దించింది. ఆరుట్ల రాంచంద్రారెడ్డి, భీంరెడ్డి నర్సింహారెడ్డి, నిర్మల కృష్ణమూర్తి తదితర నాయకత్వం పాలకుర్తిలో సమావేశం జరిపింది. కార్యకర్తలకు ధైర్యాన్ని నూరిపోసింది. ఈ సంఘటన నాటికి ఐలమ్మ భర్త, కుమారులు జైల్లోనే ఉన్నారు. జీడి సోమయ్య, వీరమనేని రాంచంద్రయ్య, కమ్మరి బ్రహ్మయ్య, మామిండ్ల కొరరయ్య, ఐలయ్య, జీడి బాలయ్య, చుక్కా సోమయ్య, ఆంధ్ర మహాసభ కార్యకర్తలు, బయటి గ్రామాల నుండి వచ్చిన నాయకులు ఐలమ్మతో సహా పొలం దగ్గర కూర్చున్నారు. పంటను కోసి ఎత్తుకెల్దామని వచ్చిన దొర గుండాలను ఎదిరించారు. ‘ఆంధ్రమహాసభకు జై, దేశ్‌ముఖ్‌ దౌర్జన్యాలు నశించాలి’ అంటూ నినాదాలు చేశారు. తాను బతికి ఉన్నంత కాలం భూమి, పంట మీకు దక్కదని ఆవేశపూరితంగా ఐలమ్మ కొంగునడుంకు బిగించి చుట్టి సంఘం అండతో ఎదురించడంతో దేశ్‌ముఖ్‌ గుండాలు పలాయనం చిత్తగించారు. ఆంధ్రమహాసభ కార్యకర్తలు వరిని కోసి, వరికట్టం కొట్టి ధాన్యాన్ని ఐలమ్మ ఇంటికి చేర్చారు. భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రాంచంద్రారెడ్డి, చకిలం యాదగిరిలు సైతం ధాన్యపు బస్తాలను భుజాలపై మోసారు. భంగపాటుకు గురైన దేశ్‌ముఖ్‌లు మరోసారి పోలీసులను ఆశ్రయించారు. తమ పంటను కమ్యూనిస్టులు దోచుకెళ్లారని నాయకులపై, స్థానికులపై కేసులు పెట్టించాడు. నాయకులను, కార్యకర్తలను అనేక రూపాల్లో చిత్రహింసలు పెడుతున్న పోలీసులను చూసి దేశ్‌ముఖ్‌ ఆనందపడిపోయాడు. కోర్టులో గెలిచేందుకు దేశ్‌ముఖ్‌ వేసిన పాచికలు పారలేదు. కమ్యూనిస్టు నాయకత్వం చొరవ, కొండా లక్ష్మణ్‌ బాపూజీ సహకారంతో ఐలమ్మకు అనుకూలంగా తీర్పువచ్చింది. రజాకార్ల ఉపసేనాధిపతి అయిన దేశ్‌ముఖ్‌ రెండుసార్లు పరాజయం పాలయ్యాడు. కోపోద్రిక్తుడై పాలకుర్తిపై దాడులు నిర్వహించి ఇండ్లను తగులబెట్టించాడు. ఐలమ్మ ఇంటిని కూడా తగులబెట్టారు. ధనాన్ని, ధాన్యాన్ని ఎత్తుకెళ్లారు. ఐలమ్మ కూతురు సోమనర్సమ్మపై అత్యాచారానికి పాల్పడ్డారు. పాలకుర్తిలో ఐదుగురిని అకారణంగా హత్యచేయించాడు దేశ్‌ముఖ్‌. అనేక రకాలుగా నష్టపోయిన ఐలమ్మ కుటుంబం ఎర్రజెండాను వీడలేదు. ఐలమ్మ కుమారులు ముగ్గురు దళకమాండర్లుగా పనిచేశారు. పాలకుర్తి పట్వారీ ఇంటిని కూల్చి అదే స్ధలంలో మొక్కజొన్న పంటను పండించిన ఘనత మరువలేనిది. ఐలమ్మ భూపోరాటం తెలంగాణా సాయుధ పోరుకు తోడ్పాటునంద

 
రాధాకృష్ణను ఉతికి ఆరేస్తాం

 

Fistహైదరాబాద్‌, మేజర్‌న్యూస్‌: రజకులను కించపరుస్తూ ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌ చేసిన వ్యాఖ్యలపై రాష్ర్ట వ్యాప్తంగా నిరసనలు వ్యక్తమా య్యాయి. రజకులకు క్షమాపణ చెప్పాలని వివిధ రజక సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. శు్ర వారం ఎబిఎస్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌లో ‘పెటాకులవుతున్న ఎన్‌ఆర్‌ఐల పెళ్లిళ్లు’ అనే కార్యక్రమం ప్రసారమైంది. ఆ సందర్భం గా…‘చదువుకున్నోడికన్న చాకలోడు మేలు’ అనే సామెతను పేర్కొని రజకులపై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై రజక సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. బట్టలకు పట్టిన మురికిని వదిలిం చి, శుభ్రంచేసే తమకు ఆంధ్రజ్యోతి-ఏబిఎన్‌కు పట్టిన అగ్రవర్ణ దురహంకారమనే మకిలిని వదిలించడం పెద్ద కష్టం కాదని రజక నాయకులు ఆ సంస్థ అధినేత రాధాకృష్ణను హెచ్చరిస్తున్నారు.

చారిత్రకంగా రజకులకు ప్రాధాన్యత ఉందని, బొబ్బిలి వీరుడు తాండ్రపాపారాయుడి ముఖ్య అనుచరులలో ‘పడాల శీతన్న’, ఆంగ్ల అనువా దకుడు ‘లచ్చన్న’ రజకులేనని, పల్నాటి యోధుడు బాలచంద్రుని ప్రియమిత్రుడు, పోరాట యోధుడు ‘చాకిబందు’ కూడా రజకుడేనని వారు చారిత్రక ఆధారాలు చూపుతున్నారు.రజక మహిళ ‘ఐలమ్మ’ ధైర్యసాహసాలు తెలంగాణ సాయుధ పోరాట చరిత్రలో రక్తాక్షరాలతో లిఖించబడ్డాయన్నారు. పురాణాల్లోనూ రజకుల పాత్ర ఉందన్నారు. అంద రికీ ఒకే న్యాయం ఉండాలని శ్రీరామచంద్రుని సైతం నిలదీసింది రజకుడేనని వారన్నారు.ఏడాది కొకతూరి తూమెడు గింజలు కొలిస్తే కుటుంబానికంతా దుస్తులు ఉతికే తమపై అవాకు లూ… చెవాకులూ పేలితే సహించబోమని మండ ిపడుతున్నారు.

గుణపాఠం చెబుతాం
తమ కులాన్ని కించపరిచి, కావాలని అవమానించే అగ్రవర్ణ దురహంకారాన్ని వీడకపోతే రాధాకృష్ణకు గుణపాఠం చెబుతామని రజక నేతలు హెచ్చరించారు. ఎబిఎన్‌- ఆంధ్రజ్యోతి ఛానల్‌ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఉపసం హరించుకుని బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేస్తున్నారు. ఛానల్‌ యాజమాన్యం స్పం దించి చేసిన అనుచిత వ్యాఖ్యలను సరిదిదు ్దకోని పక్షంలో ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నారు.

జేసీ సోదరులకు పట్టిన గతి పడుతుంది
రజకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలను సరిదిద్దుకోకపోతే జేసీ సోదరులకు పట్టిన గతి పడుతుందని బిసి యునైటెడ్‌ ఫ్రంట్‌ రాష్ర్ట అధ్య క్షులు పాలూరి రామకృష్ణయ్య హెచ్చరించారు. బీసీలను కించపరచటం ఎబిఎన్‌ ఛానల్‌కు తగదని హితవు పలికారు. గతం నుండి బీసీలకు వ్యతిరేకంగా ఆంధ్రజ్యోతి అనేక కథనాలు ప్రచురిం చిందనీ, రజకులపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఇదే తీరు గతంలో ప్రదర్శించిన ఆంధ్రజ్యోతి జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చిందని గుర్తు చేశారు.

ఆత్మగౌరవాన్ని దెబ్బతీసారు
ఎబిఎన్‌ ఛానల్‌ రజకులపై అనుచిత వ్యాఖ్యలు చేసి రజకుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసిందని రజక అభివృద్ధి సంస్థ రాష్ర్ట అధ్యక్షుడు డాక్టర్‌ ఎం. అంజయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. బలికి మేకలనే తీసుకొస్తారు కానీ, పులిని తీసుకురారు కదా… అని అంబేద్కర్‌ మాటలను గుర్తు చేశారు. బడుగు బలీహ న వర్గాలు, స్ర్తీలపై ఆయా వర్గాలను కించపరిచే సామెతలు రూపొందించారని చెప్పారు. అయితే సమాజంలో మానవతా విలువలకు గౌరవమిస్తూ అటువంటి సామెతలను సంస్కారవం తులు ఇప్పుడు ప్రస్తావించట్లేదన్నారు. ఎబిఎన్‌ ఛానల్‌ చేసిన వ్యాఖ్యలను ఇప్పటికైనా ఉపసంహ రించుకోవాలని హితవు పలికారు.

రాధాకృష్ణ బహిరంగ క్షమాపణ చెప్పాలి
ఎబిఎన్‌ ఆంధ్రజ్యోతి ఛానల్‌లో రజకులను కించపరుస్తూ చేసిన వ్యాఖ్యలు ఉపసంహరిం చుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారుల సం ఘం రాష్ర్ట కార్యదర్శి పి ఆశయ్య డిమాండ్‌ చేశారు. 40లక్షల రజకుల మనోభావాలను దెబ్బతీసిన ఛానల్‌ యాజమాన్యం క్షమాపణలు చెప్పాలన్నారు.

ఇది అగ్రవర్ణాల దురహంకారం
ఇది అగ్రవర్ణాల దురహంకారమని కాకతీయ విశ్వవిద్యాలయ ప్రోఫెసర్‌ కొమరన్న విమర్శిం చారు. ఎబిఎన్‌ ఛానల్‌లో ప్రసారమైన అంశాన్ని జీర్జించుకోలేక పోతున్నామన్నారు. వేమన ఎంతో లోతుగా అధ్యయనం చేసి రజకులపై ఓ మంచి చాటువును చెపితే దాన్ని అగ్రవర్ణాలు దురహంకారంతో వక్రీకరించాయని విమర్శించా రు. ‘‘చదివినయ్యకన్న చాకలన్న మేలు/ కులదైవం కన్న గేదె మేలు/ బాపనయ్యకన్న బయనీలు మేలయా/ విశ్వదాభిరామ వినురవేమా!’’ అంటూ వేమన పద్యాన్ని గుర్తు చేశారు.

రాష్ర్ట వ్యాప్త ఉద్యమానికి సిద్ధం
రజకులను కించపరుస్తూ ఎబిఎన్‌ ఛానల్‌లో ప్రసారమైన వ్యాఖ్యలను ఖండిస్తూ తాము రాష్ర్టవ్యాప్త ఉద్యమం చేపడతామని రజక హక్కుల పోరాట సంఘం రాష్ర్ట అధ్యక్షులు పి. సంపత్‌ కుమార్‌ హెచ్చరించారు. రజకులను చిన్న చూపు చూస్తే సహించేది లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేసిన వ్యాఖ్యలను ఉపసంహరిం చుకోవాలని డిమాండ్‌ చేశారు.

మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము

ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణా (తెలుపు రంగుతో సూచించబడినది)

ఆంధ్ర, తెలంగాణా ప్రాంతాలు కలిసి ఆంధ్ర ప్రదేశ్ ఏర్పాటు కావడంలో కీలకమైనది పెద్దమనుషుల ఒప్పందం. 1956 జూలై 19 న కుదిరిన ఈ ఒప్పందంలో తెలంగాణా అభివృద్ధికి, తెలంగాణా సమానత్వ పరిరక్షణకు సంబంధించిన నిబంధనలు ఉన్నాయి. ఆంధ్ర, హైదరాబాదు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ప్రముఖ మంత్రులు, రెండు ప్రాంతాల కాంగ్రెసు పార్టీ అధ్యక్షులు ఈ ఒప్పందంపై సంతకాలు చేసారు. ఈ ఒప్పందాన్ననుసరించి 1956 నవంబర్ 1 న ఆంధ్ర ప్రదేశ్ ఏర్పడింది. ఆంధ్ర ప్రాంతానికి చెందిన నీలం సంజీవరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాడు.
అయితే, ఈ ఒప్పందం అమలు విషయమై కొద్దికాలంలోనే తెలంగాణా ప్రజల్లో అసంతృప్తి బయలుదేరింది. ఒప్పందాన్ననుసరించి ఉప ముఖ్యమంత్రి పదవిని తెలంగాణా వాసికి ఇవ్వలేదు; అసలు ఆ పదవినే సృష్టించలేదు. అయితే 1959లో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రి కాగానే ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణా ప్రాంతానికి చెందిన కొండా వెంకట రంగారెడ్డి (కె.వి.రంగారెడ్డి)ని నియమించాడు. అయితే మళ్ళీ 1962 నుండి 1969 వరకు ఉపముఖ్యమంత్రి పదవి లేదు. మళ్ళీ 1969లో తెలంగాణా ప్రాంతానికి చెందిన జె.వి.నర్సింగరావును ఉపముఖ్యమంత్రిగా నియమించారు. ఈ విధంగా రాజకీయ పదవుల విషయంలో తమకు అన్యాయం జరిగిందని తెలంగాణా వారు భావించారు.

సామాజిక నేపథ్యం

ఆంధ్ర ప్రాంతం నుండి తరలి వచ్చిన ప్రజలు తెలంగాణా ప్రాంతంలో భూములు కొని, వ్యవసాయం చేసి అభివృద్ధి సాధించారు. ఇది తమ భూముల ఆక్రమణగా కొందరు తెలంగాణా ప్రజలు భావించారు. ప్రభుత్వ ఉద్యోగాలు, ఉపాధ్యాయుల నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందనే భావన కూడా తెలంగాణా ప్రజల్లో కలిగింది. తెలంగాణా విద్యాసంస్థల్లో కూడా తమకు తగినన్ని సీట్లు రాలేదని విద్యార్ధుల్లో అసంతృప్తి నెలకొని ఉంది.

రాజకీయ నేపథ్యం

1967లో ముఖ్యమంత్రి అయిన తరువాత కాసు బ్రహ్మానంద రెడ్డి రాజకీయంగా తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. ఆయనకు రాజకీయంగా సరిజోడీ అయిన మర్రి చెన్నారెడ్డి ఆయన మంత్రివర్గంలో మంత్రిగా ఉండేవాడు. అయితే చెన్నారెడ్డి కేంద్రంలో ఉక్కు,గనుల శాఖమంత్రిగా ఢిల్లీ వెళ్ళడంతో, ఆయన దైనందిన రాష్ట్ర రాజకీయాలకు దూరమయ్యాడు. అయితే, కొద్దిరోజుల్లోనే అనుకోని ఒక సంఘటన జరిగింది.
అంతకు కొద్దికాలం క్రితం జరిగిన శాసనసభ ఎన్నికలలో చెన్నారెడ్డి అక్రమ పద్ధతులకు పాల్పడ్డాడనే ఆరోపణతో ఆయన చేతిలో ఓడిపోయిన వందేమాతరం రామచంద్రరావు వేసిన ఒక దావాలో చెన్నారెడ్డికి వ్యతిరేకంగా కోర్టు తీర్పు ఇచ్చింది. ఆయన ఎన్నికను రద్దు చేసి, ఆరేళ్ళపాటు ఎన్నికలలో పోటీ చెయ్యకుండా నిషేధించింది. చెన్నారెడ్డి వెంటనే కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేసి, పైకోర్టుకు వెళ్ళాడు. అక్కడా ఓడిపోయాడు. చివరికి సుప్రీంకోర్టు కూడా ఆయన అభ్యర్ధనను తోసిపుచ్చింది.

ఉద్యమ ప్రారంభం

తెలంగాణా ఉద్యమం తెలంగాణా హక్కుల పరిరక్షణ ఉద్యమంగా మొదలైంది. తెలంగాణా రక్షణలను అమలు చెయ్యాలని కోరుతూ 1969 జనవరి 9న ఖమ్మం పట్టణంలో ఒక విద్యార్ధి నిరాహారదీక్ష ప్రారంభించాడు. ఆరోజు జరిగిన ఊరేగింపులో హింసాత్మక ఘటనలు జరిగాయి. మరుసటి రోజు ఉద్యమం నిజామాబాదుకు పాకింది. జనవరి 10 న హైదరాబాదులోని ఉస్మానియా విశ్వవిద్యాలయం లో జరిగిన విద్యార్ధుల సమావేశంలో – తెలంగాణా రక్షణల అమలుకై జనవరి 15 నుండి సమ్మె చెయ్యాలని ప్రతిపాదించారు.

అయితే, జనవరి 13 న అదే విశ్వవిద్యాలయంలో జరిగిన ఒక సమావేశంలో విద్యార్ధులలోని ఒక వర్గం “తెలంగాణా విద్యార్ధుల కార్యాచరణ సమితి” గా ఏర్పడి, ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర సాధనే తమ ధ్యేయంగా ప్రకటించారు. అదే రోజున పురప్రముఖులు కొందరు “తెలంగాణా పరిరక్షణల కమిటీ” ని ఏర్పాటు చేసారు.
జనవరి 18 న విద్యార్ధుల్లోని రెండు వర్గాలు (తెలంగాణా రక్షణల కోసం ఉద్యమించిన వారు, ప్రత్యేక తెలంగాణా కోరేవారు) వేరువేరుగా హైదరాబాదులో ఊరేగింపులు జరిపారు. ఈ రెండు ఊరేగింపులు ఆబిద్స్ లో ఎదురైనపుడు ఘర్షణ చెలరేగింది. పోలీసులు లాఠీఛార్జి చెయ్యవలసి వచ్చింది. అదేరోజు శాసనసభలోని ప్రతిపక్ష పార్టీలు తెలంగాణా రక్షణల అమలు కొరకు ప్రభుత్వాన్ని వత్తిడి చేసాయి.
ఉద్యమకారుల కోరికలను చర్చించడానికి ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం జనవరి 19 న అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఆ సమావేశం కింది విధంగా ఒక ఒప్పందానికి వచ్చింది.

అయితే ప్రత్యేక తెలంగాణా వాదులు ఈ ఒప్పందానికి సమ్మతించలేదు. ప్రత్యేక రాష్ట్రమే తమ ధ్యేయమని, అది నెరవేరేవరకు తమ ఉద్యమం కొనసాగుతుందని వారు ప్రకటించారు.
అఖిలపక్ష కమిటీ ఒప్పందాన్ని అమలు చేస్తూ జనవరి 22న ప్రభుత్వం ఒక ప్రభుత్వ ఉత్తర్వును జారీ చేసింది. దీని ప్రకారం ఫిబ్రవరి 28 కల్లా స్థానికులు కాని ఉద్యోగులని వారి వారి స్థానాలకు వెనక్కి పంపివేస్తారు. తెలంగాణా రక్షణల అమలుకై మిగులు నిధుల అంచనాకు ఢిల్లీనుండి ఒక బృందం వస్తుంది. ఈ హామీలతో ఉద్యమానికి ఆద్యుడైన ఖమ్మం విద్యార్ధి తన దీక్షను విరమించాడు. దీనితో తెలంగాణా రక్షణల అమలు ఉద్యమం ఆగిపోయింది; ప్రత్యేక తెలంగాణా ఉద్యమం రెండవ దశలోకి ప్రవేశించింది.

రెండవ దశ

మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము యొక్క రెండవ దశను ప్రారంభించిన ఉద్యమకర్త కాళోజీ నారాయణరావు

జనవరి 24సదాశివపేటలో జరిగిన పోలీసు కాల్పుల్లో గాయపడి మరుసటి రోజు హైదరాబాదు గాంధీ ఆసుపత్రిలో ఒక వ్యక్తి చనిపోయాడు. జనవరి 27న రంగాచార్యులు అనే ఒక ఆంధ్ర ప్రాంతపు ఉద్యోగిని నల్గొండ పట్టణంలో పెట్రోలు పోసి తగలబెట్టారు. ఆంధ్ర ప్రాంతపు ప్రజలలో భయాందోళనలు చెలరేగాయి.
జనవరి 28న వరంగల్లులో కాళోజీ నారాయణరావు అధ్యక్షతన జరిగిన సదస్సులో ముఖ్యమంత్రి రాజీనామా చెయ్యాలని, రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని తీర్మానం చేసారు. క్రమేణా ఆందోళనలో హింసాత్మక చర్యలు పెరగసాగాయి. ఆంధ్రప్రాంతపు వారి ఆస్తులు తగలబెట్టడం, దోపిడిలు విస్తృతంగా జరిగాయి. ఆంధ్ర ప్రాంతంలో కూడా ప్రజలు సమ్మెలు చెయ్యసాగారు. తెలంగాణాలోని అనేక పట్టణాల్లోను, ఆంధ్రాలోని కొన్ని పట్టణాల్లోను సైన్యం కవాతు జరిపింది. ఉద్యమం శాంతియుతంగా జరపాలని కోరుతూ ఉద్యమ నాయకుడు మల్లికార్జున్ విద్యార్ధులకు విజ్ఞప్తి చేసాడు. అయినా హింస తగ్గలేదు. ఫిబ్రవరి 25న తాండూరు లో హింసాత్మక ఘటనలు జరిగినపుడు పోలీసు కాల్పుల్లో ఒక వ్యక్తి చనిపోయాడు.

కోర్టు కేసులు

1969,జనవరి 22 నాటి ప్రభుత్వ ఉత్తర్వు రాజ్యాంగంలోని ప్రాధమిక హక్కుల అధికరణాలకు విరుద్ధమని కొందరు ఉద్యోగులు హై కోర్టులో దావా వేసారు.

అలాగే ఇదే ప్రభుత్వ ఉత్తర్వుకు వ్యతిరేకంగా జనవరి 31న ఐదుగురు తెలంగాణా ప్రాత ఉద్యోగినులు మరో దావా వేసారు. తమ భర్తలు ఆంధ్ర ప్రాతం వారని, ఈ ప్రభుత్వ ఉత్తర్వు వలన తమకు అన్యాయం జరుగుతుందని వారి వాదన.

1969,ఫిబ్రవరి 3: ఆ ప్రభుత్వ ఉత్తర్వు రాజ్యాంగ విరుద్ధమని హై కోర్టు తీర్పు నిచ్చింది.

వెంటనే రాష్ట్ర ప్రభుత్వం హై కోర్టులో మరో దావా వెయ్యగా, కోర్టు తమ ఫిబ్రవరి 3 నాటి తీర్పు అమలు పై స్టే ఇచ్చి, విచారణకు డివిజను బెంచిని ఆదేశించింది. ఫిబ్రవరి 18 న సుప్రీంకోర్టు కూడా ప్రభుత్వ ఉత్తర్వుపై స్టే ఇచ్చి, ఉద్యోగుల బదిలీలను ఆపేసింది.

1969,ఫిబ్రవరి 20: హైకోర్టు మరో తీర్పు ఇస్తూ, ఇలా వ్యాఖ్యానించింది.

  • ముల్కీ నిబంధనలు రాజ్యాంగ బద్ధమే.
  • అయితే, బయటి వారిని వెనక్కి పంపకుండా, వారికొరకు అదనపు ఉద్యోగాలను (సూపర్ న్యూమరీ) సృష్టించాలి.

అదనపు ఉద్యోగాల విషయమై తెలంగాణా ఉద్యోగ సంఘాలు నిరసన వ్యక్తం చెయ్యగా, ముల్కీ నిబంధనల పై ఆంధ్ర ప్రాంతంలో నిరసనగా సమ్మెలు జరిగాయి.

1969,మార్చి 7: ముల్కీ నిబంధనల అమలుపై మునుపు తనిచ్చిన స్టేను ధృవీకరిస్తూ, అదనపు పోస్టుల సృష్టించడాన్ని కూడా నిలిపివేసింది.

1969,మార్చి 29: సుప్రీంకోర్టు ఇలా తీర్పు ఇచ్చింది:

  • ముల్కీ నిబంధనలు రాజ్యాంగ విరుద్ధం
  • తెలంగాణాలోని ఆంధ్ర ఉద్యోగులను వెనక్కి పంపే ప్రభుత్వ ఉత్తర్వు రద్దు

తెలంగాణా ప్రజాసమితి

1969 ఫిబ్రవరి 28 న యువకులు, మేధావి వర్గాలు కలిసి హైదరాబాదులో తెలంగాణా ప్రజాసమితి ని స్థాపించారు. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రమే దీని ధ్యేయం. మొదటి కార్యక్రమంగా మార్చి 3 న తెలంగాణా బందును జరిపింది.

ఉద్యమాన్ని రాజకీయం చేసిన కాంగ్రేసు పార్టీ నాయకుడు మర్రి చెన్నారెడ్డి

మార్చి 29 న ముల్కీ నిబంధనలకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ఉద్యమం మరింత హింసాత్మకంగా మారింది. కొండా లక్ష్మణ్ బాపూజీ తన మంత్రి పదవికి రాజీనామా చేసి, తెలంగాణా కాంగ్రెసు సమితిని ఏర్పాటు చేసాడు. ఏప్రిల్ 21 న మర్రి చెన్నారెడ్డి కూడా ప్రత్యేక తెలంగాణాను సమర్ధిస్తూ ఉద్యమంలోకి రంగప్రవేశం చేసాడు. మే 1మేడే నాడు తెలంగాణా కోర్కెల దినంగా జరపాలని తెలంగాణా ప్రజా సమితి ఇచ్చిన పిలుపు హింసాత్మకంగా మారింది. మే 15 న కె.వి.రంగారెడ్డి కూడా తన పదవికి రాజీనామా చేసి, ఉద్యమ ప్రవేశం చేసాడు. అప్పటికి ఉద్యమాన్ని పూర్తిగా రాజకీయులు ఆక్రమించినట్లయింది. రాజకీయ నాయకుల జోక్యంతో ఉద్యమం నీరుగారుతుందని ఊహించిన కొందరు విద్యార్ధి నాయకులు పోటీ తెలంగాణా ప్రజా సమితిని ఏర్పాటు చేసారు. విద్యార్థి నాయకుడు శ్రీధరరెడ్డి దీనికి అధ్యక్షుడు. చెన్నారెడ్డి ప్రత్యర్ధులైన కొందరు రాజకీయ నాయకులు దీనికి మద్దతు పలికారు. వందేమాతరం రామచంద్రరావు, బద్రివిశాల్ పిట్టి వీరిలో ఉన్నారు.
1969 జూన్ మొదటి వారం ఉద్యమానికి అత్యంత హింసాత్మకమైన కాలం. సమ్మెలు, బందులు, దోపిడీలు, దాడులు, లాఠీచార్జిలు, పోలీసుకాల్పులు, కర్ఫ్యూలు మొదలైన వాటితో హైదరాబాదు అట్టుడికిపోయింది. విద్యార్ధులతోపాటు, కార్మికులు, ఉద్యోగులు కూడా సమ్మెలు చేసారు. జూన్ 10 నుండి తెలంగాణా ప్రాంత ఉద్యోగులు నిరవధిక సమ్మెను ప్రారంభించారు.
1969 జూన్ 24 న తెలంగాణా నాయకులు ప్రధానమంత్రి ఇందిరా గాంధీతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. జూన్ 25న హైదరాబాదులో సమ్మె జరిగింది. ఆ రాత్రి ఉద్యమ నాయకులను పోలీసులు అరెస్టు చేసి, రాజమండ్రికి తరలించారు. జూన్ 27 న ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డి తన పదవికి రాజీనామాచేసాడు. కానీ ఆయన తన రాజీనామా లేఖను గవర్నరుకు కాక, కాంగ్రెసు అధ్యక్షుడు నిజలింగప్పకు పంపించాడు. దానిని ఆయన తిరస్కరించాడు.
1969 ఆగష్టు 18 న లోక్‌సభలో తెలంగాణా ప్రాంత ప్రతినిధులు జి.వెంకటస్వామి, జి.ఎస్.మేల్కోటేలు ప్రత్యేక తెలంగాణా గురించి తమ వాదనను వినిపించారు. ఆగష్టు 24న కొందరిని, 28న మరికొందరిని ప్రభుత్వం రాజమండ్రి జైలు నుండి విడుదల చేసింది.

ఉద్యమం వెనుకంజ

1969 సెప్టెంబర్ లో ఉద్యమం చల్లారడం మొదలైంది. 1969 సెప్టెంబర్ 22న కొండా లక్ష్మణ్ బాపూజీ “ముఖ్యమంత్రిని మారిస్తే ఉద్యమం వాయిదా పడవచ్చు” అని అన్నాడు. ఉద్యమ తిరోగమనానికి ఇది ఒక సూచిక. విద్యార్ధులు ఆందోళన మాని చదువులకు మళ్ళాలని తెలంగాణా ప్రజా సమితి సెప్టెంబర్ 23న ఒక ప్రకటనలో పిలుపునిచ్చింది. ఆ ప్రకటనపై చెన్నారెడ్డి, మల్లికార్జున్ సంతకం చేసారు. అప్పుడు హైదరాబాదులో ఉన్న రాష్ట్రపతి వి.వి.గిరికి చెన్నారెడ్డి స్వయంగా ఈ విషయం తెలిపాడు. దీనితో విద్యార్ధులలో అయోమయం నెలకొంది. నాయకత్వంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి తలెత్తింది. కేంద్ర నాయకత్వపు సాచివేత ధోరణి దృష్ట్యా, విద్యార్థులు చదువులు నష్టపోకూడదనే ఈ నిర్ణయం తీసుకున్నామని మల్లికార్జున్ సర్ది చెప్పే ప్రయత్నం చేసాడు. సెప్టెంబర్ 25 న తెలంగాణా ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ అధ్యక్షుడి హోదాలో కొండా లక్ష్మణ్ బాపూజీ కూడా రాష్ట్రపతిని కలిసి, తెలంగాణాను ఏర్పాటు చెయ్యాలని కోరాడు.
విద్యార్థులను తరగతులకు వెళ్ళమని నాయకులు చేసిన ప్రకటన పలు విమర్శలకు గురైంది. నిరసన ప్రదర్శనలు జరిగాయి. 9 నెలలుగా చేసిన పోరాటం కొరగాకుండా పోతుందని విమర్శలు వచ్చాయి. తెలంగాణా ప్రజాసమితి ఉపాధ్యక్షుడు, వీరారెడ్డి కూడా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించాడు. 1969 సెప్టెంబర్ 29 న కేంద్ర ప్రభుత్వం తెలంగాణా నాయకులను విడివిడిగా మాట్లాడడం మొదలుపెట్టింది. రాష్ట్ర నాయకత్వ మార్పు విషయంలో సహజంగానే భిన్నాభిప్రాయాలు బయటపడ్డాయి.

అక్టోబర్ 10 నుండి తెలంగాణా అంతటా, చెన్నారెడ్డి పిలుపుమేరకు సత్యాగ్రహాలు మొదలయ్యాయి. ఇందులో 18 ఏళ్ళలోపు విద్యార్ధులు పాల్గొనరాదని నిబంధన పెట్టారు. ఆ రోజునుండి మల్లికార్జున్ నిరాహారదీక్ష మొదలు పెట్టాడు. నవంబర్ 3 వరకు కొనసాగిన ఈ దీక్ష పోలీసులు ఆయనను అరెస్టు చేసి, ఆసుపత్రిలో చేర్చడంతో ముగిసింది.
1969 నవంబర్ 26 చెన్నారెడ్డి ఒక ప్రకటన చేస్తూ విద్యార్థులు పరీక్షలలోను, గ్రామీణులు వ్యవసాయపు పనులలోను నిమగ్నమై ఉన్నందున, ఉద్యమంలో స్తబ్దత వచ్చిందని అన్నాడు. మరుసటిరోజు మరో ప్రకటనలో ప్రస్తుతానికి ఉద్యమాన్ని వాయిదా వేస్తున్నట్లూ, మళ్ళీ జనవరి 1 నుండి ప్రారంభిస్తున్నట్లు తెలియజేసాడు. ఈ ప్రకటనతో ఉద్యమం ముగిసినట్లైంది. డిసెంబర్ 6న తెలంగాణా ప్రజాసమితి నాయకులు టి.ఎన్.సదాలక్ష్మి, మరో ముగ్గురు ఒక సంయుక్త ప్రక టనలో చెన్నారెడ్డిని ప్రజాసమితి అధ్యక్ష పదవి నుండి తొలగిస్తున్నట్లు ప్రకటించారు. అయితే ప్రజాసమితిలోని మిగిలిన నాయకులెవరూ వీరికి మద్దతు నివ్వలేదు.
ఈ విధంగా 1969 సెప్టెంబర్ నుండి, 1969 డిసెంబర్ వరకు రాజకీయనాయకుల ఎత్తులు పైయెత్తుల మధ్య, ఉద్యమం తీవ్రత తగ్గుతూ వచ్చి చివరికి పూర్తిగా చల్లారిపోయింది. తెలంగాణా ప్రజాసమితి మరో రెండేళ్ళు రాజకీయాల్లో ఒక శక్తిగా చురుగ్గానే ఉంది. 1971 లో పార్లమెంటుకు జరిగిన మధ్యంతర ఎన్నికలలో 10 సీట్లు సాధించింది. అయితే ఆ ఎన్నికల్లో ఇందిరా గాంధీకి సంపూర్ణ ఆధిక్యత రావడంతో తెలంగాణా ప్రజాసమితి మద్దతు కీలకం కాలేదు. 1971 సెప్టెంబర్ 24 న బ్రహ్మానంద రెడ్డి రాజీనామా చేసాక కొద్దిరోజులకు చెన్నారెడ్డి తెలంగాణా ప్రజా సమితిని రద్దు చేసాడు.

 ఇతర విశేషాలు

తెలంగాణా ఉద్యమంలో కొన్ని ప్రత్యేకతలు కలిగిన విశేషాలు:

 

ఆంధ్ర ప్రదేశ్ లో తెలంగాణా (తెలుపు రంగుతో సూచించబడినది)

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మూడు విభాగాలలో తెలంగాణా ఒకటి, మిగతా రెండు విభాగాలనూ కోస్తా ఆంధ్ర (లేదా ఆంధ్ర లేదా సర్కారు) మరియు రాయలసీమ అని పిలుస్తారు. ఈ విభజన చారిత్రక కారణాల వల్ల వచ్చి భౌగోళిక, సాంస్కృతిక కారణాలతో అలాగే కొనసాగుతుంది. ప్రస్తుత తెలంగాణా ప్రాంతము నిజాం తన రాజ్యంలోని ప్రాంతములను రక రకాల కారణములతో బ్రిటీషువారికి ఇచ్చివేయగా మిగిలిన తెలుగు ప్రాంతము. ప్రస్తుతము తెలంగాణ ప్రాంతములో 10 జిల్లాలు కలవు. భౌగీళికంగా ఇది దక్కను పీఠభూమిలో భాగము. తెలంగాణ ప్రాంతములో 10 జిల్లాలు కలవు.దేశంలోనే పొడవైన 7వ నెంబరు జాతీయ రహదారి మరియి 9వ నెంబరు జాతీయ రహదారి ఈ ప్రాంతము గుండా వెళ్ళుచున్నది. హైదరాబాదు-వాడి, సికింద్రాబాదు-కాజీపేట, సికింద్రాబాదు-విజయవాడ, సికింద్రాబాదు-డోన్, వికారాబాదు-పర్బని, కాజీపేట-బల్హర్షా రైలుమార్గాలు తెలంగాణ ప్రాంతం నుండి వెళ్తున్నాయి. సికింద్రాబాదు, కాజీపేట రైల్వే జంక్షన్లు దక్షిణ మధ్య రైల్వేలో ప్రముఖ కూడళ్ళుగా పేరెన్నికగన్నవి.

//

భౌగోళిక స్వరూపం

ఈ ప్రాంతము దక్కను పీఠభూమిపై, తూర్పు కనుమలకు పశ్చిమంగా ఉన్నది. దక్కన్ పీఠభూమిలో భాగమైన ఈ ప్రాంతము సరాసరిన 1500 అడుగుల ఎత్తును కలిగియుండి తూర్పు వైపునకు వాలి ఉంది. తెలంగాణా కు దక్షిణమున ప్రధానముగా కృష్ణా, తుంగభద్ర నదులు ప్రవహిస్తుండగా, ఉత్తరమున గోదావరి నది ప్రవహిస్తున్నది. కృష్ణా, తుంగభద్ర నదులు దక్షిణమున తెలంగాణా మరియు రాయలసీమ, ఆంధ్ర ప్రాంతాలకు వేరుచేయుచండగా, ఆదిలాబాదు జిల్లా పూర్తిగాను, వరంగల్లు మరియు ఖమ్మం జిల్లాలలోని కొన్ని ప్రాంతాలు గోదావరికి ఉత్తరాన ఉన్నవి.

జిల్లాలు

తెలంగాణా జిల్లాలు

ప్రస్తుత తెలంగాణా ప్రాంతమునందు ఖమ్మం, మహబూబ్ నగర్, నల్గొండ, రంగారెడ్డి, వరంగల్, కరీంనగర్, నిజామాబాదు, అదిలాబాదు, మెదక్ , హైదరాబాదు అను 10 జిల్లాలు కలవు.

ఆదిలాబాదు జిల్లా ఉత్తరాన ఉండగా పశ్చిమ సరిహద్దులో ఆదిలాబాదుతో పాటు నిజామాబాదు, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నవి. ఈశాన్య సరిహద్దులో కరీమ్నగర్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలున్నాయి. దక్షిణమున మహబఊబ్ నగర్ జిల్లా, ఆగ్నేయమున నల్గొండ జిల్లా సరిహద్దుగా ఉంది. ఖమ్మం జిల్లా తెలంగాణకు అతితూర్పున ఉన్న జిల్లాగా పేరుగాంచింది. తెలంగాణ ప్రాంతపు సరిహద్దు లేని ఏకైక జిల్లా హైదరాబాదు.

భౌగోళిక మార్పులు

స్వాతంత్రానంతరం, వరంగల్లు నుండి కొంత ప్రాంతాన్నీ, గోదావరి జిల్లాలనుండి భద్రాచలం , దండకారణ్యం ప్రాంతాలకు వేరు చేసి ఖమ్మం రాజధానిగా ఖమ్మం జిల్లాను ఏర్పరచినారు, ప్రస్తుతం ఖమ్మం జిల్లా మొత్తం తెలంగాణా ప్రాంతంలోని భాగంగానే చూపించబడుతున్నది.

చరిత్ర

ప్రధాన వ్యాసము: తెలంగాణా చరిత్ర

ఈ ప్రాంతము మూడవ శతాబ్దంలో శాతవాహనులు, తరువాత కాకతీయులు, తరువాత బహుమనీ సుల్తానులు, గోల్కొండ సుల్తానులు, మొఘలు పరిపాలకులు, నిజాం సుల్తానులు పరిపాలించినారు.

భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చు నాటికి ఈ ప్రాంతము నిజాం పరిపాలనలోని హైదరాబాదు సంస్థానంలో భాగంగా ఉండేది. తరువాత తెలంగాణా పోలీసు చర్య ద్వారా ఇది స్వతంత్ర భారత గణతంత్ర రాజ్యంలో కలపబడినది, ఈ పోరాటంలో తెలంగాణా సాయుధ పోరాటంనాటి రజాకార్ల దౌర్జన్యాలకు వ్యతిరేకంగా ముఖ్య భూమిక పోషించినది. తరువాత 1956లో భాషా ప్రాతిపదికపై రాష్ట్రాల పునర్విభజన ద్వారా అప్పటి మద్రాసు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడు వారితో కలిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా ఆవిర్భవించినది.

ప్రత్యేక తెలంగాణా ఉద్యమాలు

హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలన్నీ ఆంధ్రతో కలిపి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం ఏర్పరచినపుడు, తెలంగాణా ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడాలన్న కోరిక ప్రజల్లో ఉండేది. అయితే అధిక సంఖ్యాక ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సమైక్య రాష్ట్రానికి అనుకూలంగా ఉండటంతో ఇది సాధ్యపడలేదు. అయితే, తెలంగాణా సర్వతోముఖాభివృద్ధికి ప్రతిబంధకాలు ఏర్పడకుండా ఒక ఒప్పందం కుదుర్చుకున్న తరువాతే వారు సమైక్య ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఏర్పాటుకు సమ్మతించారు.

తదనంతరం, ఈ ఒప్పందం సరిగా అమలు జరగడం లేదన్న అసంతృప్తితో విద్యార్ధులు, ఉద్యోగులు ఆందోళన వైపు పయనించారు. ఆ విధంగా 1969లో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రోద్యమం వచ్చింది.

మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము

ప్రధాన వ్యాసము: మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము

రెండవ ప్రత్యేక తెలంగాణా ఉద్యమము

తెలంగాణా ప్రాంతంలోని 10 జిల్లాలతో ప్రత్యేక తెలంగాణా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసే ఏకైక లక్ష్యంతో ప్రారంభమైంది తెలంగాణా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం. రెండవ అనే పేరు అధికారికంగా ఈ ఉద్యమ నేతలు పెట్టుకున్నది కాదు. చరిత్రలో తెలంగాణా కొరకు దీనికంటే ముందు మరో ఉద్యమం జరిగింది కనుక ఈ రెంటిని విడిగా చూపడానికి రెండవ అనే పదం వాడవచ్చు.
ఈ ఉద్యమానికి సారథి కె.చంద్రశేఖరరావు. తెలుగుదేశం పార్టీలో ఉంటూ మంత్రిగా, శాసనసభ ఉపాధ్యక్షుడిగా పనిచేసాడు. 2001 లో ఆ పార్టీ నుండి వైదొలగి, తెలంగాణా రాష్ట్ర సమితి (తెరాస) పేరిట ఒక రాజకీయ పార్టీ ని ఏర్పాటు చేసాడు. తెలంగాణా రాష్ట్రాన్ని సాధించడమే ఈ పార్టీ యొక్క లక్ష్యం. చక్కటి కార్యక్రమాలతో సమర్ధవంతమైన నాయకత్వంతో పార్టీని అట్టడుగు స్థాయి నుండి నిర్మించుకు వచ్చాడు. ప్రత్యేక రాష్ట్రం పట్ల ప్రజల్లో సహజంగా ఉండే ఆసక్తి, ఈ అంశం యొక్క ఉద్వేగ భరిత చరిత్ర కూడా దీనికి దోహదపడ్డాయి.
ఈ లోగా తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు లక్ష్యంగా భారతీయ జనతా పార్టీ లోని ప్రముఖ నేత ఆలె నరేంద్ర ఆ పార్టీ నుండి వైదొలగి, తెలంగాణ సాధన సమితి అనే సంస్థను ఏర్పాటు చేసి, ఉద్యమం ప్రారంభించాడు. కొద్ది కాలానికే – ఆగష్టు 2002 లో – తన సంస్థను తెరాస లో విలీనం చేసి, తెరాసలో తాను రెండో ప్రముఖ నాయకుడయ్యాడు.
2004 లో జరిగిన శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెసు పార్టీతో పొత్తు పెట్టుకుని, తెరాస మంచి విజయాలు సాధించింది . ఆ ఎన్నికలలో తెలుగుదేశం, భాజపా లను ఓడించి, కాంగ్రెసు (మరియు దాని నాయకత్వంలోని కూటమి) కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటినీ చేజిక్కించుకుంది. కేంద్ర, రాష్ట్రాలు రెండింటిలోనూ ప్రభుత్వంలో చేరింది.
ప్రభుత్వ నిర్ణయాలను ప్రభావితం చెయ్యగలిగే స్థానాల్లో ఉండి, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించడం తేలిక అని భావించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండింటిలోను చేరిన తెరాస, తప్పనిసరి పరిస్థితులలో రాష్ట్ర ప్రభుత్వం నుండి బయటకు రావలసి వచ్చింది. సార్వత్రిక ఎన్నికలలో కలిసి పోటీ చేసిన మిత్రులు కేవలం 16 నెలలలోపే విడిపోయి, బద్ధ శత్రువుల వలె తిట్టుకుంటూ పురపాలక సంఘ ఎన్నికలలో పరస్పరం పోటీ పడ్డారు. పురపాలక ఎన్నికలలో అతి తక్కువ స్థానాలు గెలిచిన తెరాసకు తీవ్రమైన ఎదురు దెబ్బ తగిలింది.

తెలంగాణా వాదుల వాదనలు

  • పెద్దమనుషుల ఒప్పందాన్ని ఏనాడూ ఆంధ్రులు అమలు చేయలేదు. ఉపముఖ్యమంత్రి పదవి ఇవ్వటంలేదు.
  • కృష్ణా గోదావరి నదుల పరివాహక ప్రాంతం 80 శాతం మాదైతే 88 శాతం నీళ్ళు వాళ్ళవి. కరెంటు70 శాతం ఉత్పత్తి మాది. 80 శాతం పంట ఋణాలు వాళ్ళవి. మూడొంతుల ఉద్యోగాలు వాళ్ళవి.
  • శాంతియుతంగా అన్నదమ్ముల్లా విడిపోదాం.
  • తెలంగాణ వద్ద ఉన్న వనరులతో ఆంధ్ర ప్రాంతం ఇప్పటికే చాలా ప్రయోజనం పొందింది.
  • ప్రత్యేక తెలంగాణం.. స్వాభిమానానికి ప్రతీక. ప్రత్యేక తెలంగాణాపై యాభై ఏళ్లుగా ఉద్యమాలు జరుగుతున్నాయి. ఇది ప్రజల ఆకాంక్షల నుంచి పుట్టింది.
  • రాజ్యాంగం ప్రకారం చూసినా రాష్ట్రాల ఏర్పాటు అనేది కేంద్ర పరిధిలోని అంశం. అసెంబ్లీలో తీర్మానం అవసరం లేదు. అది లేకుండానూ కేంద్రం ఆమోదించవచ్చు.
  • తమిళనాడుకే తెలుగుగంగ నీళ్లు ఇస్తున్నప్పుడు తెలంగాణా నుంచి ఆంధ్రకు నీళ్లు అందకుండా చేస్తారని అనుకోవడం సరికాదు.
  • భౌగోళిక, చారిత్రక కోణాల్లో ఎలా చూసినా హైదరాబాద్‌ తెలంగాణాలో అంతర్భాగమే.
  • విలీనం నాటికి తెలంగాణాయే పారిశ్రామికంగా ముందుండేది. గత యాభై ఏళ్లుగా తెలంగాణా చాలా త్యాగాలు చేసింది. ఆంధ్ర అభివృద్ధిలో ఎక్కువ భాగాన్ని ఆంధ్రలోని సంపన్నులు తీసుకున్నారు. తెలంగాణ వివక్షకు గురైంది. సింగరేణిలో, సచివాలయంలో అన్నిచోట్లా కోస్తావారే ముఖ్యమైన ఉద్యోగాల్లో ఉన్నారు. ఇది ఆర్థిక అసమానతలకు దారి తీసింది.
  • బడ్జెట్‌ కేటాయింపులోనూ ఆంధ్రాకే అగ్రస్థానం.

సమైక్యాంధ్రుల వాదనలు

  • పూర్తిగా అభివృద్ధి చెందిన తెలంగాణా ఇప్పుడు విడగొడితే కోస్తా వనరులన్నీ అటే వెళ్తాయి. దీనివల్ల కోస్తా ప్రాంతంలోని రైతులకు కష్టాలు తప్పవు,
  • తెలంగాణా విడిపోతే ఆ ప్రాంత ప్రజలు కోస్తాంధ్రకు రావాల్సిన నీటిని అడ్డుకుంటారు, ఫలితంగా వ్యవసాయం, దాని అనుబంధ పరిశ్రమలు మూతపడి నిరుద్యోగం పెరుగుతుంది.
  • తెలంగాణా నుంచి కోస్తాంధ్రకు చెందిన ఉద్యోగులను తరిమివేస్తారు. కోస్తాంధ్రకు ఆదాయాలు కూడా తగ్గుతాయి.
  • తెలుగు మాట్లాడే ప్రజలు విశాలాంధ్ర కోసం అనేక దశాబ్దాలు పోరాడారు. భాషా ప్రయుక్త రాష్ట్రాలనేవి జాతీయ ఉద్యమంలో ఒక భాగం. భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో సహేతుకత ఉంది.
  • దేశంలో వెనకబడిన ప్రాంతమంటూ లేని రాష్ట్రమేదీ లేదు. తెలంగాణలో కూడా వెనకబడిన ప్రాంతాలు ఉండొచ్చు. కానీ అభివృద్ధి చెందిన ప్రాంతాలూ ఉన్నాయి. ఇలాంటి విభజన కొనసాగిస్తే, విభజన రేఖ ఎక్కడ గీయగలం.
  • ప్రత్యేకవాదం సమస్యకు పరిష్కారం కాబోదు. ఇది మరో అతిపెద్ద సమస్యకు ప్రారంభం అవుతుంది. ఇతర రాష్ట్రాలతో పాటు, ప్రత్యేకవాదం గురించి మాట్లాడుతున్న అదే ప్రాంతంలోనూ భవిష్యత్తులో ఈ సమస్య తలెత్తవచ్చు.
  • చిన్న రాష్ట్రాలు దేశ ఉనికికి ప్రమాదంగా మారుతాయి.
  • తెలుగు మాట్లాడే వారంతా కలిసి ఉంటేనే అభివృద్ధి సాధించవచ్చు.
  • ఐటీ కంపెనీలు ఇతర రాష్ట్రాలకు తరలిపోవడానికి సిద్ధమవుతున్నాయి.

ప్రత్యేకాంధ్రుల వాదనలు

  • కోస్తాల్లోని వెనకబడిన ప్రాంతాలు తెలంగాణతో సమానంగా అభివృద్ధి చెందలేదు.
  • హైదరాబాద్‌పై కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోని మిగిలిన పట్టణాల అభివృద్ధిని గురించి ఎన్నడూ ఆలోచించలేరు.
  • రెండు లేదా మూడు తెలుగు రాష్ట్రాలు ఉంటే తప్పేంటి? దేశంలో చిన్న రాష్ట్రాలు అభివృద్ధి చెందటం లేదా?
  • 1956లో ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటివరకు రెండు ప్రాంతాల మధ్య భావ సమైక్యత లేదు.
  • తెలంగాణ ప్రజలంతా విడిపోవాలని కోరుకుంటున్నప్పుడు కాదు.. కలిసే ఉందామనడం సమంజసం కాదు.
  • ఆంధ్రులకు మరో ముఖ్య పట్టణం అవసరం ఉంది. ఆరోగ్య, విద్య, న్యాయ, వ్యాపార, సాంకేతికపరమైన అంశాలకు హైదరాబాద్‌ అందరికీ అందుబాటులో లేదు.
  • కోస్తా ఆంధ్రులకు సుదీర్ఘమైన 960 కి.మీ తీర ప్రాంతం ఉంది. అనేక నీటి వనరులు పుష్కలంగా ఉన్నాయి. అయితే అవేవీ అక్కడి పేద ప్రజలకు ఉపయోగపడటం లేదు.
  • విశాఖపట్నాన్ని పారిశ్రామిక కేంద్రంగా, కర్నూలు ని న్యాయవ్యవస్థా కేంద్రంగా, తిరుపతిని సాంస్కృతిక కేంద్రంగా మలుచుకోవచ్చు.
  • భౌగోళికంగా విడిపోవడంవల్ల తెలుగు భాషకు నష్టం లేదు. వివిధ మాండలికాలు అభివృద్ధి చెందుతాయి.
  • తెలంగాణ ఇవ్వడంవల్ల తెలంగాణ వారికి ఎంత ప్రయోజనమో ఆంధ్రా వారికి అంతకు రెట్టింపు ప్రయోజనం.

హైదరాబాద్: తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న చాకలి శ్రీనివాస్ మృతదేహాన్ని హైదరాబాదులోని యశోద ఆస్పత్రి నుంచి దొడ్డి దారిన పోలీసులు సోమవారం నిజామాబాద్ కు తరలించారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు, తెలంగాణవాదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ మృతదేహాన్ని గన్ పార్కుకు తరలించి నివాళులు అర్పించి నిజామాబాద్ తరలించాలని ప్రయత్నించిన తెలంగాణవాదుల ప్రయత్నాలను పోలీసులు భగ్నం చేశారు. చాకలి శ్రీనివాస్ ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.

పోలీసు ఉన్నతాధికారి లడ్హాపై తెరాస నాయకుడు నాయని నర్సింహా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద నిరీక్షిస్తున్నారని, వారికి కూడా తెలియకుండా పోలీసులు శ్రీనివాస్ మృతదేహాన్ని తరలించారని ఆయన మండిపడ్డారు. శ్రీనివాస్ చిన్నాయనతో మృతదేహాన్ని నిజామాబాద్ తరలించినట్లు పోలీసులు చెబుతుండడాన్ని ఆయన ఖండించారు. శ్రీనివాస్ మృతదేహానికి సిరికొండలో అంత్యక్రియలు జరుగుతాయి. ఈ అంత్యక్రియలకు తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు, తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ హాజరవుతున్నారు

తెలుగు న్యూస్ చానెల్ టీవీ9 ప్రసారం చేసిన వార్తను అమెరికాలోని తెలంగాణ [^] ఎన్నారైలు వ్యతిరేకించారు. ఈ మేరకు వారు టీవీ9కు ఓ లేఖ రాశారు. నిజామాబాద్ [^]జిల్లాలోని సిరికొండకు చెందిన చాకలి శ్రీనివాస్ తెలంగాణ కోసం చనిపోలేదని, కుటుంబ తగాదాల వల్ల మరణించాడని టీవీ9 తప్పుడు వార్తను ప్రసారం చేసిందని వారన్నారు. అమెరికాలోని వాషింగ్టన్ డిసిలో ఉంటున్న జగదీష్ బొందుగుల, విజయ కృష్ణ [^] చాట్ల, వేణు నక్షత్రం, రవి పల్లా, గోపాల్ పిన్నమనేని, రఘు ఆ లేఖ రాశారు.

కిషన్ రెడ్డి [^], కుమారస్వామి తదితరుల సమక్షంలో ఆర్డీవో చాకలి శ్రీనివాస్ మరణ వాంగ్మూలం తీసుకున్నారని, తాను తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నట్లు శ్రీనివాస్ ఆ వాంగ్మూలంలో స్పష్టంగా చెప్పాడని వారు తెలిపారు. ప్రజల సెంటిమెంటును దెబ్బ తీయకూడదని వారు టీవీ9కు సూచించారు. దాన్ని సవరించకోకపోతే తెలంగాణ ప్రజలను అవమానించడమేనని వారన్నారు