తెలంగాణ కోసం చాకలి శ్రీనివాస్ ఆత్మబలిదానం

Posted: 18/09/2010 in అవర్గీకృతం, రజకుల గురుంచి కొన్ని నిజాలు

హైదరాబాద్: తెలంగాణ కోసం మరో ఆత్మబలిదానం జరిగింది. ఆదివారం నిజామాబాద్ లో ఆత్మహుతి ప్రయత్నించిన చాకలి శ్రీనివాస్ అనే యువకుడు హైదరాబాదులోని యశోదా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మరణించాడు. తెలంగాణ రాష్ట్రం కోసం రాజీనామాలు చేసినవారినే గెలిపించాలనే ఆకాంక్షను వ్యక్తం చేస్తూ శ్రీనివాస్ ఆదివారంనాడు ఒంటిపై కిరోసిన్ పోసుకుని ఒంటికి నిప్పంటించుకున్నాడు. తీవ్రంగా గాయపడిన శ్రీనివాస్ ను తొలుత సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రికి తరలించారు. అక్కడ బర్నింగ్ వార్డులో ఖాళీలు లేవంటూ హైదరాబాద్ మలక్ పేట యశోదకు తరలించారు.

శ్రీనివాస్ నిజామాబాద్ జిల్లా సింగూరు గ్రామవాసి. తెలంగాణ ఉద్యమంలో చురుగ్గా పాల్గొంటూ వస్తున్నాడు. నిజామాబాద్ అర్బన్ కు ఉప ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో శ్రీనివాస్ ఆత్మహత్య చోటు చేసుకుంది. ఇక్కడ ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ పోటీ చేస్తున్నారు. తెలంగాణ కోసం రాజీనామా చేసి తిరిగి పోటీ చేస్తున్న బిజెపికి చెందిన లక్ష్మినారాయణను ఆయన ఎదుర్కుంటున్నారు

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s