రజకుల రక్షణకు ఐక్య పోరాటాలు

Posted: 28/04/2011 in రజకుల గురుంచి కొన్ని నిజాలు

భూస్వాములు, పెత్తందారుల దాడులు, దౌర్జన్యాలకు గురవుతున్న రజకులకు రక్షణ కల్పించేందుకు అన్ని సంస్థల్ని (రజక సంస్థలు, సంఘాలు) పోగుచేసి విశాల ప్రాతిపదికన ఐక్య పోరాటాలు నిర్వహించాలని పలు రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. రజకులపై పెత్తనం చెలాయిస్తూ వారిని సాంఘిక బహిష్కరణకు గురిచేస్తున్న వారికి భారీ స్థాయిలో జరిమానాలు విధించేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రజకుల పనికి తగిన వేతనమిచ్చి వారి వృత్తిని గౌరవించాలని అన్నారు. ‘రజకులకు రక్షణ చట్టాన్ని చేయాలి’ అనే డిమాండ్‌పై ఆంధ్రప్రదేశ్‌ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యాన బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రాజకీయ పార్టీలతో రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహించారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎం.దుర్గారావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి బివి రాఘవులు, శాసనమండలి సభ్యులు చెరుపల్లి సీతారాములు, పిజె చంద్రశేఖరరావు (సిపిఐ), పొగాకు యాదగిరి (టిడిపి), నాయిని నర్సింహారెడ్డి (టిఆర్‌ఎస్‌), ఇ.చె

రజకుల రక్షణకు ఐక్య పోరాటాలు

న్నయ్య (లోక్‌సత్తా), జూపల్లి జానకిరాములు (ఆరెస్పీ), పి.జమలయ్య (కన్వీనర్‌, చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ), లెల్లెల బాలకృష్ణ (ప్రధాన కార్యదర్శి, మత్స్యకారులు, మత్స్యకార్మిక సంఘం), జాన్‌వెస్లీ (ప్రధాన కార్యదర్శి, కెవిపిఎస్‌), వెంకటేశ్వర్లు (రాష్ట్ర కార్యదర్శి, వ్యవసాయ కార్మిక సంఘం), అరుణ్‌కుమార్‌ (హైకోర్టు న్యాయవాది) పాల్గొన్నారు. రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.ఆశయ్య ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సమావేశం ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా రాఘవులు మాట్లాడుతూ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రజకులు తీవ్రమైన వివక్షకు గురవుతున్నారన్నారు. దళితులు, గిరిజనులతో పోలిస్తే వివక్ష మోతాదులో తేడా ఉన్నప్పటికీ వీరూ అంటరానివారుగానే పరిగణించబడుతున్నారన్నారు. రాష్ట్రంలో దళితుల తర్వాత రజకులే అత్యధికంగా అవమానాలకు గురవుతున్నారని చెప్పారు. వివక్ష, దాడుల విషయంలో వెనుకబడిన వర్గాల్లోని ఇతర కులాలకు, రజక వృత్తిదారులకు చాలా తేడా ఉందన్నారు. రజకులు, నాయీ బ్రాహ్మణులు మినహా మిగతా కులాలన్నీ వ్యవసాయోత్పత్తితో ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ముడిపడి ఉన్నాయని తెలిపారు. అందువల్ల ఆయా కులాల వారిపై దాడుల కంటే రజకులపై జరిగే దౌర్జన్యాలే ఎక్కువని వివరించారు. ‘మా దుస్తుల్ని శుభ్రంగా ఉంచటం మీ బాధ్యత’ అనే విధంగా గ్రామాల్లోని పెత్తందారులు రజకుల పట్ల వ్యవహరిస్తున్నారని అన్నారు. దాడులు, దౌర్జన్యాలు జరిగినప్పుడు ప్రతిఘటించే విధంగా రజకుల్లో అవగాహన పెంపొందించాలని రాఘవులు సూచించారు. పిజె చంద్రశేఖరరావు మాట్లాడుతూ భారత సమజానికి, కులానికి విడదీయరాని సంబంధం ఉందన్నారు. పని ప్రదేశాల్లో రజక మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని విమర్శించారు. వారికి తగిన రక్షణ కల్పించటంలో అధికారులు, ప్రభుత్వం విఫలమయ్యాయని విమర్శించారు. యాదగిరి మాట్లాడుతూ రాష్ట్రంలో రజకులు ఎస్సీ, ఎస్టీల కంటే హీనంగా దుర్భర జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని ఎస్సీల్లో కలపాలని ఆయన డిమాండ్‌ చేశారు. నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ రజకులపై దాడులు జరిగిన ప్రాంతాల్లో పర్యటించి వాస్తవ విషయాలను పరిశీలించాలని అన్ని పార్టీల నాయకులకు సూచించారు. చెరుపల్లి మాట్లాడుతూ రాష్ట్రంలోని రజకుల పరిస్థితిని అధ్యయనం చేసేందుకు రజక వృత్తిదారుల సంఘం నాయకులు జిల్లాల్లో విస్తృతంగా పర్యటించాలని సూచించారు. గ్రామాల్లోని పెత్తందారులు, భూస్వాములు వివిధ వృత్తిదారుల్ని కులాలవారీగా విడగొట్టటం ద్వారా వారి ఐక్యతను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. వృత్తిదారులందరూ ఐక్యంగా ఉండటం ద్వారా పెత్తందారుల ఆగడాలకు అడ్డుకట్టవేయాలని పిలుపునిచ్చారు.

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s